Rashmika Look Leak From Pushpa 2 Sets : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'పుష్ప 2' మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 'పుష్ప' పార్ట్-1 భారీ సక్సెస్ అవడంతో 'పుష్ప 2'ని మరింత గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన మేకర్స్ అనుకున్న టైంకి సినిమాని విడుదల చేసేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తున్నారు. ఇటీవల వైజాగ్ లో ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇదిలా ఉంటే 'పుష్ప 2' మూవీ టీం కి లీకుల బెడద ఎక్కువైపోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలానే లీక్స్ వచ్చాయి ఇక ఇప్పుడు మరో లీక్ బయటికి వచ్చింది.
'పుష్ప 2' నుండి రష్మిక లుక్ లీక్
'యానిమల్' సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. తాజాగా ఈ కన్నడ బ్యూటీ 'పుష్ప 2' న్యూ షెడ్యూల్ షూటింగ్లో జాయిన్ అయింది. ఈ లేటెస్ట్ షెడ్యూల్ నుంచే రష్మిక లుక్ లీక్ అయ్యింది. 'పుష్ప 2' లో శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న రష్మిక ఎరుపు రంగు చీరలో ఒంటినిండా నగలతో ముస్తాబై ఉన్న వీడియో లీకై నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫాన్స్ శ్రీవల్లి పాత్రలో రష్మిక మహారాణిలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
యాగంటి లో 'పుష్ప 2' షూటింగ్
'పుష్ప 2' లేటెస్ట్ షెడ్యూల్ ని యాగంటి లో ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని హీరోయిన్ రష్మిక మందన స్వయంగా తన ఇన్ స్టా స్టోరీస్ లో ఓ పిక్ షేర్ చేస్తూ తెలిపింది. " ఈ రోజు యాగంటి టెంపుల్ లో షూట్ చేసాం. ఈ ప్రదేశం యొక్క చరిత్ర ఎంతో అద్భుతం. అలాంటి ఈ చారిత్రాత్మక గుడిలో కొంత సమయాన్ని గడపడం ఇంకెంతో అద్భుతంగా అనిపించింది" అని రాసుకొస్తూ #Pushpa2therule అనే హ్యాష్ ట్యాగ్ ని జత చేసింది. దీంతో 'పుష్ప 2' షూటింగ్ యాగంటిలో జరుగుతుందనే విషయం రష్మిక పోస్ట్ ద్వారా బయట పడింది.
ఏప్రిల్ 8 న 'పుష్ప 2' స్పెషల్ సర్ప్రైజ్
'పుష్ప 2' నుంచి త్వరలోనే అదిరిపోయే సర్ప్రైజ్ రాబోతుందని సమాచారం. అది కూడా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 9 న ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్ సుమారు రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక లతోపాటు ఫాహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగదీష్ బండారి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : గ్రాండ్‌గా పూజతో ప్రారంభమైన రామ్ చరణ్ కొత్త సినిమా - ముఖ్య అతిథిగా మెగాస్టార్