Rashmika’s Hubby Should Be Like VD : 'పుష్ప' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత కెరీర్ పరంగా కాస్త డీలాపడ్డ నేషనల్ రష్మిక మందన గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన 'యానిమల్' తో భారీ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ హిట్ అవ్వడంతో రష్మిక ఒక్కసారిగా పుంజుకుంది. యానిమల్ సక్సెస్ తరువాత సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ వాళ్లతో చిట్ చాట్ కూడా చేస్తూ ఉంటుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పింది.
కాబోయే భర్త 'VD' లా ఉండాలి
రష్మిక మందన ఢిల్లీ ఫ్యాన్స్ అనే ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లో రష్మిక మందన్న కాబోయే భర్త ఎలా ఉండాలనే డిస్కషన్ నడిచింది. సదరు అకౌంట్లో ఫ్యాన్స్ రష్మిక కాబోయే భర్త గురించి కొన్ని క్వాలిటీస్ చెప్పారు. అతను 'VD' లాగా ఉండాలని ఫ్యాన్స్ చెబితే ఆ పోస్టు కింద రష్మిక 'అవును నిజమే' అని రిప్లై కూడా ఇచ్చింది. ఇంతకీ 'VD' అంటే మీరు అనుకుంటున్నట్టు 'విజయ్ దేవరకొండ' కాదండోయ్! VD అంటే 'Very Daring' అని అర్ధం.. "రష్మిక ఇండియాకి నేషనల్ క్రష్ కాబట్టి ఆమె కాబోయే భర్త చాలా స్పెషల్ గా అంటే 'VD' లాగా ఉండాలి. అంటే దాని అర్ధం 'వేరి డేరింగ్' గా ఉంటూ ఆమెను ప్రొటెక్ట్ చేయాలి. ఆమెను మేము క్వీన్ లాగా పిలుచుకుంటాం కాబట్టి ఆమె కాబోయే భర్త కూడా కింగ్ లాగా ఉండాలి" అంటూ ఫ్యాన్స్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కి రష్మిక రిప్లై ఇస్తూ..' అవును అది నిజమే' అని రాసుకొచ్చింది
ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చిందా?
ట్విట్టర్లో ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ తనకు కాబోయే భర్త విజయ్ దేవరకొండ అని రష్మిక ఇలా హింట్ ఇచ్చిందంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. విజయ్ దేవరకొండను ముద్దుగా 'VD' అని పిలుస్తుంటారు. అయితే ఈ పోస్టులో 'VD' అనే పదానికి ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ అనే అర్థం వెతుకుతూ రష్మిక విజయ్ దేవరకొండతో తన రిలేషన్ ని ఇలా పరోక్షంగా కన్ఫర్మ్ చేసిందని.. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
వరుస సినిమాలతో బిజీగా
రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. తెలుగులో పాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇక ఈ ఏడాది రష్మిక నుంచి ఏకంగా నాలుగు సినిమాలు రాబోతున్నాయి. అందులో రెండు సినిమాలు బాలీవుడ్ నుంచే కావడం విశేషం. ఇక తెలుగులో ప్రస్తుతం 'పుష్ప 2', 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంది. వీటిలో 'పుష్ప2' షూటింగ్ చివరి దశలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న అపేక్షకుల ముందుకు రానుంది.
Also Read : 'ఓం భీమ్ బుష్'ను ఇంగ్లీష్‌లో తీసి హాలీవుడ్‌లో రిలీజ్ చేద్దామనుకున్నాం - హీరో శ్రీవిష్ణు