Ambajipeta Marriage Band OTT Release : యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రీసెంట్ మూవీ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శివాని నాగరం హీరోయిన్ పాత్ర పోషించింది. శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న, 'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ బండారి త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 2న విడుదలైన ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకుంది. కలెక్షన్స్ విషయంలోనూ అదుర్స్ అనిపించింది. ఈ సినిమా తొలి రోజు ఏకంగా రూ. 2 కోట్లకు పైగా వసూళు చేసి ఆశ్చర్యపరిచింది. ఓ చిన్న సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించడం గొప్ప విషయం అని చిత్రబృందం వెల్లడించింది. ఈ మూవీ విమర్శలకు నుంచి ప్రశంసలు దక్కించుకుంది. సుహాస్ నటన, శివాని అందం, అభినయం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.


మార్చి 1 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్


థియేటర్లలో ఆడియెన్స్ ను అలరించిన ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’ సినిమా, ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కీలక ప్రకటన చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఈ మేరకు సుహాస్ తో షూట్ చేసిన ఓ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మార్చి 1 నుంచి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉండబోతున్నట్లు తెలిపింది. ఆహా ప్రకటన అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. థియేటర్లలో చూడని వాళ్లు ఇక ఓటీటీలో చూసేందుకు ఎదురుచూస్తున్నారు.






విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’  


ఇక ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కించారు దర్శకుడు దుశ్యంత్. హీరో సుహాస్, హీరోయిన్ శివాని నటన అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో సుహాస్ అక్క‌గా న‌టించిన ఫిదా ఫేమ్ శ‌ర‌ణ్య‌  పర్ఫార్మెన్స్‌ కు మంచి మార్కులు ప‌డ్డాయి. వీళ్ల న‌ట‌న అద్భుతం అంటూ ప్ర‌శంస‌లు దక్కాయి. ఇక సుహాస్ విషయానికి వస్తే, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ మొదలు పెట్టిన ఆయన హీరోగా మంచి గుర్తింపు పొందాడు. 'కలర్‌ ఫొటో', 'రైటర్‌ పద్మభూషణ్‌' లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగానే కాకుండా నెగెటివ్ పాత్రలోనూ నటించి మెప్పించాడు. 'హిట్‌: ది సెకండ్‌ కేసు'లో సైకో కిల్లర్  పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగిపోయిన నటించడంలో ముందుంటున్నాడు సుహాస్. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’ ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి. ఈ మూవీని  జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ధీరజ్ మొగిలినేని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.    


Read Also: అభిమాని వింత కోరికను తీర్చిన ప్రియాంక మోహన్, పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు