Om Bheem Bush Teaser Lauch Event: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ 'ఓం భీమ్ బుష్'. 'బ్రోచేవారెవరూ' తర్వాత వీరు ముగ్గురూ కలిసి నవ్వించబోతున్న చిత్రమిది. 'నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్' అనేది ట్యాగ్ లైన్. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ కథానాయికలుగా నటించారు. యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్, టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకున్నాయి. సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ... ''ముందుగా ఈ సినిమాను పూర్తిగా ఇంగ్లీష్ లో తీసి హాలీవుడ్ లో రిలీజ్ చేయాలని అనుకున్నాం. ఇది పాన్ వరల్డ్ సినిమాలాగా ఏ లాంగ్వేజ్ లో రిలీజ్ చేసినా... ఎక్కడ రిలీజ్ చేసినా ఆడుతుంది. ఇలాంటి పాయింట్ తో ఇప్పటివరకూ ఎవరూ సినిమా తీయలేదు. మేమే ఫస్ట్ టైం తీస్తున్నాం. రాహుల్, దర్శి.. మా ముగ్గురి పాత్రలకు అందరూ విపరీతంగా కనెక్ట్ అవుతారు. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా థియేటర్ లోకి వచ్చి కూర్చోండి.. రెండుగంటల పాటు మీరు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు. దాంట్లో డౌట్ లేదు. టీజర్ లో శాంపిల్ గా చూపించాం. ఈ సినిమా అంతా గుప్త నిధులు గురించి ఉంటుంది. వాటి కోసం ముగ్గురు శాస్త్రవేత్తలు ఏం చేశారనేది ఈ సినిమాలో కంటెంట్. వెన్నెల కిశోర్ పాత్ర ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తారు. అది ఎందుకనేది సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది.'' అని అన్నారు.
''ఓం భీమ్ బుష్ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన సునీల్ కి, యువీ క్రియేషన్స్ వంశీకి ధన్యవాదాలు. డైరెక్టర్ హర్ష గురించి చాలా స్టోరీ చెప్పాలి. తనతో పనిచేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాం. చాలాసార్లు ఎంజాయ్ చెయ్యలేక ఏడ్చేశాం కూడా. ఎందుకంటే ఈ డ్రెస్ తో సమ్మర్ లో పల్లెటూర్లలో షూటింగ్ చేయడం అంటే పిచ్చెక్కిపోయేది. కష్టం అనిపించినప్పటికీ బాగా ఎంజాయ్ చేశాం. చాలా కొత్త లోకేషన్స్ లో ఈ సినిమా చేశాం. టెక్నికల్ టీం అంతా బాగా కష్టపడి వర్క్ చేసారు. ఈ మూవీ తర్వాత కచ్చితంగా ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ కు పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తాయి. ఈ చిత్రంలో పనిచేసిన నటీనటులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు'' అని శ్రీ విష్ణు చెప్పుకొచ్చారు.
దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి మాట్లాడుతూ 'ఓం భీమ్ బుష్' టీజర్ ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. రాబోయే ట్రైలర్ కూడా బావుటుందని అన్నారు. ట్రైలర్, సినిమా ఇంకా అద్భుతంగా వుంటాయని ప్రియదర్శి తెలిపారు. రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ 'దర్శకుడు ఈ సినిమా కోసం ఏడాదిన్నర పాటు మమ్మల్ని టార్చర్ పెట్టాడు( నవ్వుతూ). స్పేస్ షూట్ లో షూటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మేము పడిన కష్టానికి ఫలితం దక్కాలంటే మీరు తప్పకుండా థియేటర్లలో ఈ సినిమా చూడాలి. ఈ మూవీ చాలా హిలేరియస్ గా వుంటుంది' అని అన్నారు.
'ఓం భీమ్ బుష్' చిత్రాన్ని మార్చి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సన్నీ ఎంఆర్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. శ్రీకాంత్ రామిశెట్టి ఆర్ట్ డైరెక్టర్ గా, విజయ్ వర్ధన్ ఎడిటర్ గా వర్క్ చేసారు. 'సామజవరగమన' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీవిష్ణు నుంచి రాబోతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read: ఈ బ్యూటీని గుర్తుపట్టారా? పవన్ కళ్యాణ్ సినిమాలో నటించిన ఈమె ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?