Rashmika Deepfake Video: డీప్ ఫేక్ కారణంగా పలువురు సినీ తారలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసభ్య వీడియోలకు నటీమణుల ముఖాలను యాడ్ చేసి సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న, కాజోల్‌, కత్రినా కైఫ్ తో పాటు పలువురు నటీమణులు డీప్ ఫేక్ వీడియోల బారినపడ్డారు. గతంలో రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపై పలువురు అగ్ర తారలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలను క్రియేట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమితాబాబ్ బచ్చన్ మొదలుకొని చిరంజీవి వరకు పలువురు నటీనటులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశ వ్యాప్తంగా డీప్ ఫేక్ వీడియోలపై తీవ్ర దుమారం చెలరేగడంతో కొందరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వీడియోలను క్రియేట్ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరించింది.


మరోసారి డీప్ ఫేక్ బారిన పడిన రష్మిక మందన్న


ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, సెలబ్రిటీలకు డీప్ ఫేక్ వీడియోల ముప్పు తప్పడం లేదు. తాజాగా రష్మిక మరోసారి డీప్‌ ఫేక్‌ బారిన పడింది. ఆమెకు సంబంధించిన ఓ ఫేక్‌ వీడియో మళ్లీ నెట్టింట వైరల్ అవుతోంది. అసభ్య రీతిలో డ్యాన్స్ చేస్తున్న ఓ యువతి ముఖానికి రష్మిక ముఖాన్ని పెట్టి ఈ వీడియోను రూపొందించారు. అత్యంత దారుణంగా ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. రష్మిక అభిమానులు డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసే వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా ఇలాంటి వీడియోలను తయారు చేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. మొదట్లోనే సీరియస్ యాక్షన్ తీసుకుంటే మళ్లీ ఇలాంటి వీడియోలు రాకుండా ఉంటాయంటున్నారు. అటు ఈ వీడియోపై రష్మిక నుంచి ఎలాంటి స్పందన రాలేదు.   






వరుస సినిమాలతో రష్మిక ఫుల్ బిజీ  


ఇక రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ తో  కలిసి చేసిన‌ 'పుష్ప' మూవీతో ఆమెకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. రీసెంట్ గా బాలీవుడ్ మూవీ 'యానిమ‌ల్‌' అనే సినిమా చేసింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా ఏకంగా రూ.950 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ప్ర‌స్తుతం ఆమె 'పుష్ప‌-2', 'ది గ‌ర్ల్‌ ఫ్రెండ్‌', 'రెయిన్ బో' లాంటి సినిమాలతో బిజీగా ఉంది. ‘యానిమ‌ల్’ సీక్వెల్ 'యానిమాల్ పార్క్‌'లోనూ రష్మిక నటిస్తుందని సందీప్ రెడ్డి వంగా చెప్పారు. వ‌రుస సినిమాలతో తనకంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ర‌ష్మికను డీప్ ఫేక్ వీడియోలు వెంటాడటంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Read Also: అనంత్ అంబానీకి బాలీవుడ్ స్టార్స్ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే - కళ్లు తిరుగుతాయ్ జాగ్రత్త!