Rashmika Mandanna First Look Released From Thama Movie: బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ బాలీవుడ్ హారర్ కామెడీ థ్రిల్లర్ 'థామా'. తాజాగా ఈ మూవీ నుంచి రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. మూవీలో ఆమె రోల్ 'తడాఖా' అని తెలిపారు.
ఈ మూవీలో తాను ఇంతకు ముందెన్నడూ పోషించని ఓ డిఫరెంట్ రోల్‌లో కనిపించనున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రష్మిక. అందుకు తగినట్లుగానే ఆమె లుక్ అదిరిపోయింది. తన కెరీర్‌లో ఫస్ట్ టైం హారర్ కామెడీ మూవీలో ఆమె నటించగా... ఇందులో ఆమె దెయ్యం పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. జుట్టు విరబూసుకుని కాస్త రుద్రమైన కళ్లతో భయపెట్టేలా ఉన్న లుక్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ టీజర్‌ను మంగళవారం ఉదయం 11:11 గంటలకు రిలీజ్ చేయనున్నారు.
దీపావళికి రిలీజ్
ఈ మూవీకి ఆదిత్య సర్పోత్ధార్ దర్శకత్వం వహిస్తుండగా... దినేశ్ విజన్ నిర్మిస్తున్నారు. ఆయుష్మాన్, రష్మికలతో పాటు పరేశ్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీలు నటిస్తున్నారు. ఈ దీపావళికి మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మడాక్ ఫిల్మ్స్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా 'థామా' మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ యూనివర్స్‌లో భాగంగా ఇప్పటివరకూ స్త్రీ, భేడియా, ముంజ్యా, స్త్రీ 2 మూవీస్ వచ్చాయి. ఇప్పుడు 'థామా' రాబోతుండగా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.