Shin Tom Chacko's Soothravakyam OTT Release On ETVwin: దసరా, దేవర మూవీస్‌లో విలన్‌గా మెప్పించిన షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలో నటించిన మలయాళ లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'సూత్రవాక్యం'. జులై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. కేవలం థ్రిల్లింగ్ అంశాలే కాకుండా ఆలోచనాత్మక మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌తో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది ఈ మూవీ. ఇప్పుడు తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఈటీవీ విన్'లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది 'సూత్రవాక్యం'. 'మిస్సింగ్ లింక్. దాచిన నిజం. సూత్రవాక్యంలో అసలు రహస్యం బయటపడుతుంది.' అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులో ఉండనుంది.

ఈ మూవీకి యుజియన్ జోస్ చిరమ్మల్ దర్శకత్వం వహించగా... షైన్ చాకోతో పాటు విన్సీ అలోషియస్, దీపక్ పరంబోర్ కీలక పాత్రలు పోషించారు. సినిమా బండి ప్రొడక్షన్ బ్యానర్‌‌పై కాండ్రేగుల లావణ్యా దేవి సమర్పణలో కాండ్రేగుల శ్రీకాంత్ నిర్మించారు. మలయాళంలో మూవీ రిలీజ్ కాగా... తెలుగులో రిలీజ్ చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇప్పుడు తాజాగా ఓటీటీలో తెలుగులో మూవీ అందుబాటులోకి రానుంది.

Also Read: సార్... దూల తీరిపోతుంది - జగపతిబాబు టాక్ షోలో శ్రీలీల అల్లరే అల్లరి

స్టోరీ ఏంటంటే?

పోలీస్ అనే వారు కేవలం డ్యూటీనే చేయాలా ఫ్రీ టైంలో ఎందుకు పిల్లలకు పాఠాలు చెప్పకూడదు? పోలీసుల్ని చూసి భయపడే సంస్కృతి ఇంకా ఎందుకు కొనసాగుతుంది? అనే ఆలోచనలకు చక్కటి ఎంటర్‌టైన్‌మెంట్ మెసేజ్ జోడించి ఈ మూవీని రూపొందించారు. ఇక  స్టోరీ విషయానికొస్తే... కేరళలోని ఓ పోలీస్ స్టేషన్‌లో క్రిస్టో జేవియర్ (షైన్ టామ్ చాకో) సీఐగా పని చేస్తుంటాడు. కేవలం తన డ్యూటీ మాత్రమే చేసుకుని వెళ్లిపోకుండా... స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్‌లోనే చిన్న పిల్లలకు పాఠాలు చెబుతుంటాడు. అతని టీచింగ్ నచ్చిన పిల్లలు స్కూల్ మానేసి మరీ జేవియర్ స్కూల్‌కే వస్తుంటారు. దీంతో అతనిపై స్కూల్ టీచర్ నిమిషా (విన్సీ) ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇస్తుంది.

మరోవైపు... క్రిస్టో ట్యూషన్‌కు వచ్చే ఆర్య (అనఘా) అనే అమ్మాయిపై ఆమె సోదరుడు వివేక్ (దీపక్ పరంబోల్) చేయి చేసుకుంటాడు. దీంతో అతన్ని హెచ్చరిస్తాడు క్రిస్టో. ట్యూషన్‌కు వచ్చే మరో అబ్బాయితో తన చెల్లెలు స్నేహంగా ఉండడం చూసి సహించలేని వివేక్ ఇద్దరిపైనా దాడి చేస్తాడు. ఈ ఘటన తర్వాత వివేక్ కనిపించడు. అతని పేరెంట్స్‌ను అడిగితే వివేక్ ఇంటర్వ్యూకు హైదరాబాద్ వెళ్లాడని చెబుతారు. అసలు వివేక్ నిజంగానే హైదరాబాద్ వెళ్లాడా? వివేక్ పేరెంట్స్ అబద్ధం చెప్పారా? వివేక్ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తోన్న క్రమంలో మరో అమ్మాయి మర్డర్ కేసు బయటపడుతుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.