శ్రీవల్లి పాత్రతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగింది రష్మిక మందన్న (Rashmika Mandanna). అయితే ఆమె సౌత్ లోనే అత్యంత దారుణంగా ట్రోలింగ్ ఎదుర్కొన్న హీరోయిన్ నుంచి నేషనల్ క్రష్ వరకు ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకమని చెప్పాలి. కెరీర్ లో ఎదురైన ఎన్నో అడ్డంకులను సమయస్ఫూర్తితో ఎదుర్కొని, నేడు నెంబర్ వన్ పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకెళ్తోంది రష్మిక. ఆమె కంటే ముందే పాపులర్ అయిన ఎంతో మంది హీరోయిన్లు కూడా చూడలేని కెరీర్ పీక్స్ 'క్రేజ్', 'హై'ని రష్మిక మందన్న చూస్తోంది. దానికి కారణం 'పుష్ప' మూవీనే. 'పుష్ప 2' మూవీ థియేటర్లోకి రావడంతో మరోసారి రష్మిక మందన్న పేరు మార్మోగుతోంది. 


'కాంతారా' ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం 'కిరిక్ పార్టీ'తో రష్మిక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో 'చార్లీ  777' ఫేమ్ రక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. 2016 లో రిలీజ్ అయిన ఈ మూవీ రష్మికకు మంచి పేరు తెచ్చి పెట్టింది. సాన్వి జోసెఫ్ అనే పాత్ర ఆమెను కన్నడ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ చేసింది. కానీ ఆ తర్వాత సొంత గడ్డపైనే రష్మిక తీవ్ర విమర్శలు ఎదుర్కొక తప్పలేదు. అసలు ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది అంటే.... బెంగళూరులోని ఎమ్మెస్ రామయ్య కాలేజీలో చదువుతున్నప్పుడు రష్మిక అనేక అందాల పోటీలలో పాల్గొంది. అందులో భాగంగా మోడలింగ్ ఛాన్స్ లు వచ్చాయి. ఆమె సహజమైన చరిష్మాకు ఫిదా అయినా ఈ స్టార్స్ 'కిరిక్ పార్టీ'లో ఛాన్స్ ఇచ్చారు. మొదటి సినిమాతోనే ఆమె కెరీర్ టర్న్ అయింది. ఆ తర్వాత కన్నడ పరిశ్రమలో పలు సినిమాలు చేసిన రష్మిక 2018లో 'ఛలో' అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతో తెలుగులో కూడా సక్సెస్ అయింది. 


ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ఆమె చేసిన 'గీత గోవిందం' మూవీ రష్మిక కెరీర్ ని పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా సౌత్ నుంచి నార్త్ దాకా.. వరుసగా తెలుగు, హిందీ, కన్నడ, తమిళ సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది రష్మిక. ఇక ఇప్పుడు 'పుష్ప 2' సినిమాతో నేషనల్ క్రష్ గా మారింది. అయితే ఈ జర్నీలో ఆమె దారుణమైన ట్రోలింగ్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2017లో ఆమె మొదటి సినిమా 'కిరిక్ పార్టీ' హీరో రక్షిత్ శెట్టితో రష్మికకు నిశ్చితార్థం జరిగింది. కానీ ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లిని రద్దు చేసుకుంది ఈ జంట. దీంతో రష్మిక తీసుకున్న నిర్ణయం ట్రోలింగ్ కు దారి తీసింది. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' సినిమా చేస్తున్నప్పుడు విజయ్ దేవరకొండతో ఆమె రిలేషన్ షిప్ లో ఉంది అనే వార్తలు రావడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారయింది.


Also Readసుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?



ఇటువంటి ట్రోలింగ్ ఎదుర్కొంటూనే రష్మిక వరుస అవకాశాలతో దూసుకెళ్లింది. బాలీవుడ్ లో అడుగు పెట్టాక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, ఆమె చేసిన కామెంట్స్ విమర్శలకు దారి తీసాయి. సౌత్ లో ఐటమ్ సాంగ్స్ కు ప్రాముఖ్యత ఉంటుందని, కానీ బాలీవుడ్లో రొమాంటిక్ సాంగ్స్ కే ఇంపార్టెన్స్ ఇస్తారని ఉంటాయని ఆమె చెప్పిన మాటలు విమర్శలకు దారి తీసాయి. అలాగే ఓ ఇంటర్వ్యూలో 'కాంతారా' సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు... తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ప్రొడక్షన్ హౌస్ గురించి రష్మిక మందన్న మాట్లాడడానికి ఇష్టపడకపోవడం మరో వివాదం. ఇన్ని జరిగినప్పటికీ 2023లో యానిమల్, వారీసు, 2024లో 'పుష్ప 2' సినిమాలతో ఆమె నేషనల్ క్రష్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న తీరు ఆదర్శనీయం. 


Also Readపుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?