రష్మిక (Rashmika Mandanna)ది కర్ణాటకలోని కూర్గ్ ఏరియా. అయితే, ఆవిడ హైదరాబాద్ సిటీలో సెటిలై చాలా సంవత్సరాలు అవుతోంది. దీపావళి పండక్కి కూడా ఇంటికి వెళ్ళలేదు. హైదరాబాద్ సిటీలో, ఆ మాటకు వస్తే దేవరకొండ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విషయం ఎవరో చెప్పలేదు, స్వయంగా రష్మిక చేసిన కామెంట్ వల్ల స్పష్టమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...


విజయ్ దేవరకొండ తమ్ముడు ఫోటోలు తీశాడు!
దీపావళి సందర్భంగా సోషల్ మీడియాలో రష్మిక కొన్ని ఫోటోలు షేర్ చేశారు. అభిమానులతో పాటు ప్రేక్షకులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.‌‌ అయితే ఇక్కడ ఒకటి ట్విస్ట్ ఉంది. ఆ ఫోటోలు షేర్ చేసిన గంట తర్వాత ఆ పోస్టు కింద రష్మిక మరో కామెంట్ చేశారు. ఫోటో క్రెడిట్ ఆనంద్ దేవరకొండ అని, థాంక్యూ ఆనందా అని పేర్కొన్నారు. 


Also Readప్రభాస్ ఫ్యాన్స్‌కు కిర్రాక్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా - అదేమిటో తెలుసా?






దీపావళి సందర్భంగా తాను దిగిన ఫోటోలను విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తీశాడని రష్మిక స్వయంగా చెప్పడంతో దేవరకొండ ఫ్యామిలీతో పాటు వాళ్ళ ఇంట్లోనే ఆవిడ దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారని ప్రేక్షకులు అందరికీ అర్థమైంది.


'గీత గోవిందం' సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన ఈ కన్నడ అమ్మాయి, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆమె నటన ప్రేక్షకులకు నచ్చింది. ఇంకేముంది అగ్ర హీరోలతో సినిమాలో చేసే అవకాశాలు తెచ్చింది. తెలుగులో తన తొలి సినిమా 'గీత గోవిందం'లో హీరో విజయ్ దేవరకొండతో రష్మిక ప్రేమలో ఉన్నారని కొన్నాళ్ళుగా తెలుగు చిత్రసీమలో గుసగుసలు చాలా అంటే చాలా వినపడుతున్నాయి. 


అటు విజయ్ దేవరకొండ గానీ, ఇటు రష్మిక గాని ఎప్పుడూ తాము ప్రేమలో ఉన్నామని నేరుగా చెప్పలేదు. అలాగని తమ ప్రేమను దాచే విధంగా కూడా ప్రవర్తించడం లేదు. ఇంతకు ముందు దీపావళి లేదా ఇతర పండగలకు విజయ్ దేవరకొండ, రష్మిక వేరు వేరుగా ఫోటోలు షేర్ చేసేవాళ్ళు. హాలిడేస్ వెళ్లిన టైంలో కూడా! అప్పుడు ఆ రెండు ఫోటోలలో బ్యాక్ గ్రౌండ్స్ చూసి ఆడియన్స్ అంతా ఎవరికి తోచిన రీతిలో వారు కథలు అల్లడం మొదలు పెట్టేవారు. ఇప్పుడు ఆ అవకాశం ఇవ్వకుండా రష్మిక డైరెక్ట్ గా తన ఫోటోలు తీసింది ఆనంద్ దేవరకొండ అని పేర్కొన్నారు.


Also Read: దీపావళి హంగామా... సూర్య, ఎన్టీఆర్, దేవరకొండ, మెగా ఫ్యామిలీ పండగ ఫోటోలు



ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఓ సినిమా వేడుకకు రష్మిక అతిథిగా వచ్చారు. అప్పుడు ఆమెను ఆనంద్ దేవరకొండ ఒక ప్రశ్న అడగ్గా... 'నన్ను స్పాట్ లో పెడతావా? నేను ఫ్యామిలీ' అని రష్మిక ఇచ్చిన సమాధానంతో చాలా మందికి ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలో షేర్ చేయడం ద్వారా మరింత క్లారిటీ వస్తుంది.