మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ల‌ ముద్దుల మేనల్లుడు... హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'రంగ రంగ వైభవంగా'. ఇందులో కేతికా శర్మ కథానాయిక. థియేటర్లలో శుక్రవారం ఈ సినిమా విడుదల అయ్యింది. రొటీన్ కథతో దర్శకుడు గిరీశాయ సినిమా తీశారని విమర్శకులు పేర్కొన్నారు. అటు ప్రేక్షకుల నుంచి కూడా పెద్దగా స్పందన రాలేదు. ఆ ప్రభావం వసూళ్లపై స్పష్టంగా కనిపించింది.


'రంగ రంగ వైభవంగా'...
వసూళ్లలో వైభవం లేదుగా!
Ranga Ranga Vaibhavanga First Day Collection : టైటిల్‌లో ఉన్న వైభవం సినిమాలో లేదని 'రంగ రంగ వైభవంగా' ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. వసూళ్ళలో కూడా వైభవం ఏమీ కనిపించలేదు. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కేవలం రెండు కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు టాక్. 


తెలుగు రాష్ట్రాల్లో 'రంగ రంగ వైభవంగా' తొలి రోజు వసూళ్లు చూస్తే...
నైజాం : రూ. 31 లక్షలు 
ఉత్తరాంధ్ర : రూ. 12 లక్షలు 
సీడెడ్ : రూ. 10 లక్షలు నెల్లూరు :  రూ. 5 లక్షలు
గుంటూరు :  రూ. 16 లక్షలు
కృష్ణా జిల్లా : రూ. 7 లక్షలు 
తూర్పు గోదావ‌రి : రూ. 9 లక్షలు 
పశ్చిమ గోదావ‌రి : రూ. 6 లక్షలు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి రోజు రూ. 1.65 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. షేర్ వసూళ్లకు వస్తే... 96 లక్షలు కలెక్ట్ చేసిందట.


Ranga Ranga Vaibhavanga Worldwide Collection First Day : కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కేవలం నాలుగు లక్షలు మాత్రమే కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు ఓవర్సీస్ వసూళ్లు కూడా ఏమంత ఆశాజనకంగా లేవు. జస్ట్ ఏడు లక్షలు మాత్రమే కలెక్ట్ చేసిందట. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా రూ. 1.90 కోట్లు గ్రాస్ (రూ. 1.07 కోట్ల షేర్) వచ్చిందట.


సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
'రంగ రంగ వైభవంగా' సినిమాకు ఓవరాల్‌గా 8.50 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. 'కొండపొలం' సినిమా ఫ్లాప్ అయినప్పటికీ... 'ఉప్పెన' సక్సెస్ వల్ల మంచి బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ అయ్యి డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభాలు రావాలంటే కనీసం తొమ్మిది కోట్లకు పైగా కలెక్ట్ చేయాలి. ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే... 'రంగ రంగ వైభవంగా' తొమ్మిది కోట్ల మార్క్ చేరుకోవడం కష్టమేనని తెలుస్తోంది.




Also Read : ఫ్లాప్‌ల‌తో క‌ట్టిన స్టార్‌డ‌మ్ కోట - ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ క్రేజ్ వేరే లెవల్




'తమ్ముడు, 'ఖుషి' రీ రిలీజ్ ఎఫెక్ట్ పడిందా?
'రంగ రంగ వైభవంగా' సినిమా మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'తమ్ముడు', 'ఖుషి' రీ రిలీజ్ ఎఫెక్ట్ బలంగా పడింది. మెగా అభిమానులు ఎక్కువ మంది ఆ సినిమాలు చూడటానికి ఆసక్తి చూపించారు. మేనల్లుడి సినిమా కంటే మావయ్య సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి.


Also Read : 'రంగ రంగ వైభవంగా' రివ్యూ : కొత్తగా లేదేంటి? కొత్తగా లేదేంటి?