Dulquer Salmaan: దుల్కర్ టైమ్ వేస్ట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాతలపై రానా ఆగ్రహం

తాజాగా జరిగిన ‘కింగ్ ఆఫ్ కోట’ తెలుగు ఈవెంట్‌లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు రానా.

Continues below advertisement

కొందరు హీరోలను వెతుక్కుంటూ పాన్ ఇండియా కథలు, డైరెక్టర్లు వాటంతట అవే వస్తాయి. ఒక భాషలో సినిమాను చేసి వేరే భాషల్లో విడుదల చేసి, దానికి పాన్ ఇండియా ట్యాగ్ ఇవ్వడం కంటే ఒక హీరో పాన్ ఇండియా స్థాయిలో ఒకేవిధంగా పాపులారిటీని సంపాదించుకోవడం చాలా కష్టం. అలాంటి ఒక స్థాయిని, స్థానాన్ని దుల్కర్ సల్మాన్ దక్కించుకున్నాడు. మొదట్లో లవర్ బాయ్‌గా అందరికీ పరిచయమయినా.. తర్వాత విభిన్న కథలతో, సినిమాలోని తన పాత్రలతో అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం దుల్కర్.. ‘కింగ్ ఆఫ్ కోట’ అనే ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటించాడు. ఆ సినిమాను తెలుగులో ప్రమోట్ చేయడం కోసం నాని, రానా దగ్గుబాటి సాయం తీసుకున్నాడు. ఇక తాజాగా జరిగిన ‘కింగ్ ఆఫ్ కోట’ తెలుగు ఈవెంట్‌లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు రానా.

Continues below advertisement

హీరోయిన్ టైమ్ వేస్ట్ చేసింది..
దుల్కర్ సల్మాన్ అసలు ఎక్కువగా కోపడ్డడు అంటూ రానా బయటపెట్టాడు. ‘కింగ్ ఆఫ్ కోట’ ఈవెంట్‌లో మాట్లాడిన రానా.. ‘దుల్కర్ యాక్టింగ్ స్కూల్‌లో నా జూనియర్. మేము అక్కడే స్నేహితులం అయ్యాం. తను చాలా మంచి మనిషి. అప్పుడు తను ఒక హిందీ మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా నిర్మాతలు కూడా నా స్నేహితులే. నా ఇంటి దగ్గర్లోనే మూవీ షూటింగ్ జరుగుతుంది. దుల్కర్‌ను కలవడం కోసం లొకేషన్‌కు వెళ్లాను. తను లొకేషన్‌లో ఒక స్పాట్ బాయ్‌తో కూర్చొని ఉండగా.. ఒక పెద్ద హిందీ హీరోయిన్ ఫోన్‌లో బిజీగా ఉంది. ఆ హీరోయిన్ టైమ్ వేస్ట్ చేయడం చూసి నా కోపం ఆగలేదు. కానీ దుల్కర్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆ హీరోయిన్ ప్రవర్తనకు నేను నిర్మాతలను తిట్టాను.’ అంటూ దుల్కర్‌తో తనకున్న స్నేహాన్ని, అనుభవాన్ని తెలిపాడు రానా. అంతే కాకుండా దుల్కర్ ఒక యాక్షన్ సినిమా చేస్తే చూడాలని తాను ఎప్పటినుండో ఎదురుచూస్తున్నానని అన్నాడు.

ఓనమ్ కోసం ప్రత్యేకంగా..
‘కింగ్ ఆఫ్ కోట’ సినిమా అనుభవాల గురించి దుల్కర్ సల్మాన్ ప్రేక్షకులతో పంచుకున్నాడు. ‘కింగ్ ఆఫ్ కోట అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. అందులోని పాత్రలు, కథ, ప్రొడక్షన్.. ఇలా అన్ని అంశాలు సినిమాను వేరే లెవెల్‌లో నిలబెట్టాయి. నేను మొదటిసారి ఈ చిత్రం కోసం జీ స్టూడియోస్‌తో చేతులు కలపడం మరింత ఉత్సాహంగా అనిపించింది. వేఫారర్ ఫిల్మ్స్‌కు, జీ స్టూడియోస్‌కు, నాకు.. ఇది ఒక ప్రత్యేకమైన జర్నీగా గుర్తుండిపోతుంది. ఓనమ్‌కు నా ప్రేక్షకులకు ఇది ఒక ప్రత్యేకమైన ట్రీట్’ అంటూ దుల్కర్ చెప్పుకొచ్చాడు. దర్శకుడు అభిలాష్ జోషీకి ఇది మొదటి చిత్రమే అయినా.. తనను నమ్మి నిర్మాతలు ఈ సినిమాపై భారీగానే ఖర్చుపెట్టారు. 

పాన్ ఇండియా హీరో అంటే దుల్కరే..
‘కింగ్ ఆఫ్ కోట’ ఈవెంట్‌లో పాల్గొన్న నాని సైతం దుల్కర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. తనకు తెలిసిన అసలైన పాన్ ఇండియా హీరో దుల్కర్ మాత్రమే అని అన్నాడు. అంతే కాకుండా ‘కింగ్ ఆఫ్ కోట’ తప్పకుండా హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్టుగా తెలిపాడు. ఇక ఈ చిత్రంలో దుల్కర్‌కు జోడీగా ఐశ్వర్య లక్ష్మి కనిపించనుంది. ఆగస్ట్ 24న ‘కింగ్ ఆఫ్ కోట’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్ సీరిస్‌పై స్పందించిన అంబేద్కర్ మనవడు - రాధికా ఆప్టే పాత్రపై వ్యాఖ్యలు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement
Sponsored Links by Taboola