Rana Reaction On Baahubali The Epic Run Time: తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'బాహుబలి' మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసింది. ఈ హిస్టారికల్ ఎపిక్ రీ రిలీజ్ కాకుండా రెండు పార్టులను ఒకే పార్టుగా విడుదల చేస్తామని దర్శక ధీరుడు రాజమౌళి ప్రకటించినప్పటి నుంచీ అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ మూవీ రన్ టైం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగుతోంది.

Continues below advertisement


4 గంటలా... 5 గంటలా...


ఈ మూవీ రన్ టైం 4 గంటలు కాదు 5 గంటలు అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కొందరు మీమర్స్ ట్రోలింగ్స్ కూడా చేశారు. తాజాగా... దీనిపై రానా రియాక్ట్ అయ్యారు. 'బాహుబలి' భల్లాల దేవుని పాత్రలో ఆయన అద్భుతమైన నటనతో మెప్పించారు. 'ఈ మూవీ రన్ టైమ్ ఎంత ఉన్నా నాకు చాలా ఆనందం. ఎందుకంటే ఈ ఏడాదిలో నేను ఏ మూవీలోనూ యాక్ట్ చేయకుండానే నాకు బ్లాక్ బస్టర్ రానుంది. నిడివి ఎంత అనేది నాకు కూడా క్లారిటీ లేదు.


కొందరు 4 గంటలు అంటున్నారు. ఇంకొందరు 5 గంటలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంత రన్ టైం ఉంటే చూస్తారా! అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. ఈ మూవీ రన్ టైం కేవలం రాజమౌళికి మాత్రమే తెలుసు. నాకైతే ఆయన ఏం చెప్పలేదు. ఆయన చెబితేనే రన్ టైం ఎంత అనేది తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ రన్ టైం క్లారిటీ రావొచ్చు.' అని స్పష్టం చేశారు.


త్వరలోనే రానా కొత్త మూవీ


ఇటీవల 'రానా నాయుడు 2' వెబ్ సిరీస్‌లో కనిపించారు రానా. ఓ వైపు నటిస్తూనే మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఆయన నిర్మించిన 'కొత్తపల్లిలో ఒకప్పుడు' మూవీ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన... మంచి కథతో మూవీ రూపొందించామని అన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్ ట్రెండ్ అవుతోంది. తాను త్వరలోనే మరో కొత్త మూవీతో రాబోతున్నట్లు చెప్పారు. 


Also Read: అతనితో లవ్‌లో బ్యూటీ తాన్య రవిచంద్రన్ - లిప్ లాక్‌తో కన్ఫర్మ్ చేసేసిందిగా...


ప్రభాస్, రానా ప్రధాన పాత్రలో నటించిన 'బాహుబలి' రిలీజ్ అయి పదేళ్లు పూర్తైన సందర్భంగా ఈ మూవీని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే, ఇది రీ రిలీజ్ కాదని... రెండు పార్టులను ఒకే పార్టుగా మూవీని తీసుకొస్తున్నట్లు రాజమౌళి ప్రకటించారు. దీనికి 'బాహుబలి: ది ఎపిక్' అని పేరు పెట్టారు. ఫస్ట్ పార్ట్‌ను 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' అనే సస్పెన్స్‌తో ఎండ్ చేయగా... రెండో పార్ట్‌లో దానికి ఆన్సర్ రివీల్ చేస్తూ ముగించారు. ఇప్పుడు రెండు పార్టులు కలిపి వస్తుండడంతో ఏ సీన్స్ ఉంచుతారు? ఏ సీన్స్ తీసేస్తారు? అనేది ఆసక్తిగా మారింది.


ఇటీవలే ఈ మూవీ రన్ టైంపై నెట్టింట ఫన్నీ మీమ్స్ ట్రోలింగ్ కాగా... 'మేం మీ రోజంతా తీసుకోం. ఈ మూవీ ఓ థ్రిల్లింగ్ ఐపీఎల్ మ్యాచ్‌లా ఉంటుంది.' అంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే, రన్ టైం ఎంతనే దాన్ని మాత్రం రివీల్ చేయలేదు. కొందరు మాత్రం మూవీ అలానే ఉంచేయాలని కట్ చెయ్యొద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అక్టోబర్ 31న 'బాహుబలి: ది ఎపిక్' ప్రేక్షకుల ముందుకు రానుంది.