Actor Aasif Khan Health Update: 'మీర్జాపూర్' వెబ్ సిరీస్‌తో మంచి ఫేం సంపాదించుకున్న యాక్టర్ ఆసిఫ్ ఖాన్ ఆస్పత్రిలో చేరారు. గుండెపోటుతో అస్వస్థతకు గురై ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. 'జీవితం చాలా చిన్నది' అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా... అభిమానులు ఆందోళన చెందారు. తాను ఆస్పత్రిలో చేరానని... ప్రస్తుతం కోలుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

ఆస్పత్రి పైకప్పు ఫోటో షేర్ చేస్తూ...

ఓ ఆస్పత్రి పైకప్పు ఫోటోను షేర్ చేసిన ఆసిఫ్... '36 గంటలుగా దీన్ని చూస్తుంటే లైఫ్ చిన్నదని అర్థమైంది. దేన్నీ తేలిగ్గా తీసుకోవద్దు. ఒక్క క్షణంలో అన్నీ మారిపోవచ్చు. మీకు మీరు కృతజ్ఞతతో ఉండండి. మీ లైఫ్‌లో ఎవరు ముఖ్యమో గుర్తు పెట్టుకుని, వారితో ఆనందంగా ఉండండి. జీవితం ఓ వరం లాంటిది.' అంటూ తన ఇన్ స్టా స్టోరీలో పేర్కొన్నారు.

'అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరాను. కోలుకుంటున్నానని తెలియజేస్తున్నందుకు ఆనందంగా ఉంది. నాపై చూపిన ప్రేమ విషయంలో మిమ్మల్ని అభినందిస్తున్నా. త్వరలోనే తిరిగొస్తా.' అంటూ రెండో పోస్ట్ ద్వారా అభిమానులకు చెప్పారు.

Also Read: తల్లిదండ్రులైన కియారా - సిద్ధార్థ్ మల్హోత్ర కపుల్ - ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

మీర్జాపూర్‌తో మంచి పాపులర్

'రెడీ', 'టాయిలెట్' వంటి హిందీ సినిమాల్లో నటించిన ఆసిఫ్ 'మీర్జాపూర్' వెబ్ సిరీస్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇందులో ఆయన బాబర్‌గా మెప్పించారు. ఆ తర్వాత 'పంచాయత్' వెబ్ సిరీస్‌లో గణేష్ పాత్రలో నటించారు. 'పాతాళ్ లోక్' సిరీస్‌లోనూ కీలక పాత్ర పోషించారు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ఆయన చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోలుకుంటుండగా రెండు డిశ్చార్జి అవుతారని సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.