Kutty Padmini Sensational Comments About Sexual Harasment In Tamil Industy: మలయాళం ఇండస్ట్రీలో హేమా కమిటీ రిపోర్ట్ సంచలనం సృష్టించింది. మీ టూ ఉద్యమం ఊపందుకుంది. మహిళా యాక్టర్లు చేస్తున్న ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇక ఇప్పుడు అది తమిళ ఇండస్ట్రీకి కూడా పాకింది. సీనియర్ నటి, ప్రొడ్యూసర్ కుట్టి పద్మిని చేసిన కామెంట్స్ ఇప్పుడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళనాడులో చాలామంది మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని చెప్పారు కుట్టి పద్మిని. ఒక నేషనల్ మీడియాతో మాట్లాడిన ఆమె ఈ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా సింగర్ చిన్మయి శ్రీపాదను కూడా ఆమె సపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె శ్రీరెడ్డి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు.
ఆధారాలు చూపించలేరు - కుట్టి పద్మిని
కేరళలో జరుగుతున్న పరిణామాలపై ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి కుట్టి పద్మిని ఇలా చెప్పుకొచ్చారు. "అక్కడ అలా జరగడం చాలా దురదృష్టం. కానీ, తమిళనాడులో కూడా అదే పరిస్థితి ఉంది. సినిమా ఫీల్డ్ అనేది డాక్టర్, ఐటీ, ఇతర ప్రొఫషన్స్ లాంటిదే కదా. కానీ, ఎందుకు ఇక్కడే ఇంత దారుణం. డైరెక్టర్లు, టెక్నీషియన్స్ చాలామంది సెక్సువల్ కమిట్ మెంట్ అడుగుతారు. నిజానికి వాటిని నిరూపించేందుకు ఆడవాళ్ల దగ్గర ఆధారాలు ఉండవు. అలాంటప్పుడు ఎలా నిరూపిస్తారు. చాలామంది మహిళలు ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. కానీ కొంతమంది మాత్రం డబ్బు కోసం వాళ్లు ఏది అడిగితే అది చేస్తారు. నిజానికి తమిళ ఇండస్ట్రీలో ప్రశ్నిస్తే వాళ్లని బ్యాన్ చేస్తారు. చిన్మయి శ్రీపాద, శ్రీ రెడ్డి లాంటి వాళ్లు కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించినందుకు వాళ్లను బ్యాన్ చేశారు. శ్రీరెడ్డికి అసోసియేషన్ లో మెంబర్ షిప్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. నేను సురేశ్ గోపి స్టేట్ మెంట్ చూశాను. ఆయన ఆధారాలు ఉంటే చూపించండి అని సవాలు విసిరారు. ఆధారాలు ఏరకంగా చూపిస్తారు? కావాలంటే లై డిటెక్టర్ టెస్ట్ చేసుకోండి సీబీఐ చేసినట్లు" అంటూ కుట్టి పద్మిని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పందించిన చిన్మయి శ్రీపాద..
సింగర్ చిన్మయి శ్రీ పాద చాలా రోజుల నుంచి మీ టూపై పోరాడుతూనే ఉంది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఆమె ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఆమె స్పందించారు. కుట్టి పద్మిని ఇంటర్వ్యూ ఎక్స్ లో పోస్ట్ చేసిన ఆమె "హమ్మయ్య తమిళ ఇండస్ట్రీ నుంచి ఫైనల్ గా దీనిపై కనీసం ఒక్కరైనా మాట్లాడారు. అది చాలు" అని పోస్ట్ చేశారు.
ఇక ఈ ఇష్యూపై తమిళనాడు మినిస్టర్ స్వామినాథన్ స్పందించారు. తమకు ఎలాంటి కంప్లైంట్ రాలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆరోపణలు వస్తే కచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు ఆయన. మలయాళం సినిమా ఇండస్ట్రీని మీ టూ ఉద్యమం షేక్ చేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి హేమా కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో చాలామంది లేడీ యాక్టర్స్ బయటికి వచ్చి తమకు జరిగిన అన్యాయాలపై మాట్లాడారు. దీంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం యాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్ తదితరులు రాజీనామా చేశారు. రెండు నెలల తర్వాత కొత్త పాలకవర్గం ఏర్పడనున్నట్లు ప్రకటించారు.