Pushpa Producer on Pawan Kalyan Comments: మరో మూడు రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే వస్తుంది. సెప్టెంబర్ 2న ఆయన పుట్టిన రోజు సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ రవి శంకర్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 2న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్ ఉండబోతుందని తెలిపారు. కాగా ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఈ ఏపీ ఎన్నికల్లో గెలిచిన ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. దీంతో అప్పటికే ఆయన సైన్ చేసిన సినిమా షూటింగ్‌లు వాయిదా పడ్డాయి.
సెప్టెంబర్ 2న అప్డేట్ ఇస్తాం
ఇక ఆయన బాధ్యతలు చేపట్టి మూడే నెలలు దాటింది. ఈ నేపథ్యంలో ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు స్వయంగా ఆయనను కలిసినట్టు దర్శకుడు హరీష్ శంకర్ చెప్పారు. ఇప్పుడు ఇదే విషయాన్ని గుర్తు చేశారు నిర్మాత రవి శంకర్. పవన్ త్వరలోనే తిరిగి షూటింగ్ లో పాల్గొంటారని స్పష్టం చేశారు. ఆయన పుట్టిన రోజు సెప్టెంబర్ 2న 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి ఏదోక అప్‌డేట్ ఉంటుందని తెలిపారు. తమకు ఉన్న కాస్తా కంటెంట్‌లో నుంచి ఇప్పటికే చాలా అప్‌డేట్స్ ఇచ్చామని, ఆయన పుట్టిన రోజు నాడు కూడా ఫ్యాన్స్‌ని డిసప్పాయింట్ చేయమన్నారు. ఇక మరికొన్ని రోజుల్లో పవన్ షూటింగ్‌లో పాల్గొంటారని, డిసెంబర్, జనవరి కల్లా షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నామన్నారు.
పవన్ అలాంటి వారు కాదు
కాగా ఇప్పటి వరకు ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించిన 20 శాతం షూటింగ్ మాత్రమే జరిగింది. ఆ తర్వాత బెంగళూరు సమావేశంలో పవన్ కళ్యాణ్ పుష్ప మూవీని ఉద్దేశించి అడవులపై చేసిన కామెంట్స్‌పై నిర్మాత రవి శంకర్ స్పందించారు. "అవి ఆయన ఫ్లోలో అన్న మాటలని, ఉద్దేశపూర్వంగా అన్న మాటలు కాదన్నారు. అసలు పవన్ కళ్యాణ గారు అలాంటి వ్యక్తి కాదని, ఏదో కాంటెక్వ్చల్లో చేసిన వ్యాఖ్యలు అవి. వాటిని మనమే దీనికి, దానికి అట్టించి కావాలని అన్నారని భావిస్తున్నారు" అంటూ వివరణ ఇచ్చారు. ఇక జనసేన నేతలు అల్లు అర్జున్‌పై చేస్తున్న వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు.
ఇలాంటివి అన్ని టెంపరరీ అని, ఎవరి ఎన్ని అన్నా, అనుకున్నా.. చివరికి ఫ్యామిలీ అన్నాక ఒక్కటవుతారన్నారు. ఇప్పుడు జరుగుతున్నవన్ని సినిమాకు ముందుకు వరకు వచ్చే పుకార్ల లాంటివి అని, సినిమా రిలీజ్ అయ్యాక అంతా ఒకటే కదా అన్నట్టు ఉంటుందని, గతంలో ఇలాంటివి ఎన్నో జరిగాయి, ఎన్న చూడలేదు. చివరి ఫ్యామిలీ అంతా ఒక్కటే అవుతారు" అన్ని అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రేతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేలా వ్యవహరించి హీరోయిజం చూపేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. హీరోలే అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేయడం హీరోయిజం మారిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక తాను సినీ రంగానికి చెందిన వాడినే అయినప్పటికీ పరిస్థితులు ఎలా మారిపోయాయో అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ 40 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం అంటూ పవన్ ప్రశ్నించారు. దీంతో ఆయన అల్లు అర్జున్‌ను ఉద్దేశించే అన్నారంటూ ప్రచారం మొదలైంది.
Also Read: ఆ రూమర్లకు చెక్, పుష్ప 2 రిలీజ్‌పై నిర్మాత క్లారిటీ - ఈ వినాయక చవితికి నో అప్‌డేట్స్ అంట!