మాస్ సినిమాల అందు బోయపాటి శ్రీను (Boyapati Srinu) మాస్ సినిమాలు వేరని చెప్పుకోవాలి. 'సరైనోడు'లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎలా కనిపించారో చూశారుగా! ఇప్పుడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni)ని అంత కంటే మాసీగా చూపించనున్నారని ఒక్కొక్క స్టిల్ చూస్తుంటే అర్థం అవుతోంది!


బోయపాటి మాస్ హీరోగా రామ్!
రెండు రోజుల్లో రామ్ పోతినేని పుట్టినరోజు (మే 15). ఈ సందర్భంగా ఫస్ట్ థండర్ (BoyapatiRAPO 𝐅𝐢𝐫𝐬𝐭 𝐓𝐡𝐮𝐧𝐝𝐞𝐫) పేరుతో సినిమా గ్లింప్స్ విడుదల చేస్తున్నారు. రామ్ బర్త్ డే నాడు... ఉదయం 11.25 గంటలకు గ్లింప్స్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ విషయం చెబుతూ ఓ స్టిల్ విడుదల చేశారు. అందులో రామ్ మామూలు మాస్ లుక్కులో లేరు! 


బోయపాటి శ్రీను ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో హీరోలను చూసినా సరే... ఇంత కంటే మాసీగా ఉన్నట్టు ఎక్కడ కనిపించదు. గ్లింప్స్ వస్తే... రామ్ లుక్ మీద మరింత క్లారిటీ వస్తుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఫస్ట్ థండర్ విడుదల చేస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఆ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.


Also Read 'న్యూసెస్' వెబ్ సిరీస్ రివ్యూ : జర్నలిస్టులు డబ్బుకు దాసోహం అయితే?






బోయపాటి బర్త్ డేకు 85 కేజీల కేక్!
ఏప్రిల్ 25న బోయపాటి శ్రీను బర్త్ డే జరిగింది. అప్పుడు ఆయనకు హీరో రామ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. బోయపాటి కోసమే రామ్ 85 కేజీల కేక్ ప్రత్యేకంగా తెప్పించారు. బహుశా... బోయపాటి బరువు 85 కేజీలు ఏమో!? సినిమాలో కథానాయికగా నటిస్తున్న శ్రీలీల, సీనియర్ హీరో శ్రీకాంత్ సహా ఇతర యూనిట్ సభ్యులు ఆ కేక్ చూసి ఆశ్చర్యపోయారని తెలిసింది.


విజయ దశమి సందర్భంగా అక్టోబర్ నెలలో బోయపాటి శ్రీను, రామ్ పోతినేని సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అది చూస్తే... దున్నపోతును రామ్ తీసుకుని వెళుతున్నారు. మాసివ్ లుక్ ప్రేక్షకులను అట్ట్రాక్ చేసింది. సినిమాలో ఫైట్స్ కూడా అంతే మాసివ్ గా ఉంటాయని తెలిసింది. 


Also Read : 'ఇమ్మోర్టల్ అశ్వత్థామ'గా అల్లు అర్జున్ - బాలీవుడ్‌లో భారీ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ సినిమా?


సినిమాలోని హైలైట్స్‌లో ఆ బుల్ ఫైటింగ్ సీన్ ఒకటి అని తెలిసింది. సుమారు పదకొండు రోజుల పాటు ఆ ఫైట్ తీశారట. దానికి భారీ ఖర్చు అయ్యిందని, నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని టాక్. ఇది కాకుండా 1500 మందితో మరో ఫైట్ తీశారట. బుల్ ఫైటింగ్ యాక్షన్ సీక్వెన్సు కోసం భారీ లైట్స్ యూజ్ చేశారు. హైదరాబాదులోని ఓ ప్రయివేట్ స్టూడియోలో ఆ సీన్ తీశారు. షూటింగ్ చేసేటప్పుడు లైట్స్ కోసం పవర్ కావాలి కదా! వాటికి 28 జెనరేటర్లు అవసరం అయ్యాయని, స్టూడియోలో అన్ని లేకపోవడంతో బయట నుంచి చాలా తెప్పించారని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.


శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై  పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. 'ది వారియర్' తర్వాత రామ్ తో ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఇందులో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు.