Ram Pothineni About 'Double Ismart' New Release date : ఉస్తాద్ హీరో రామ్ పోతినేని - డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. యూత్ అండ్ మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా తెగ నచ్చేసింది. అప్పటివరకు వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న పూరి జగన్నాథ, రామ్ ఇద్దరికీ ఈ సినిమా భారీ బూస్టింగ్ ఇచ్చింది. ఇక అలాంటి ఈ బ్లాక్ బస్టర్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పుడే రిలీజ్ డేట్ ని వెల్లడించారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇక తాజాగా హీరో రామ్ స్వయంగా 'డబుల్ ఇస్మార్ట్' ఎప్పుడు విడుదలవుతుందో స్వయంగా వెల్లడించారు.
'డబుల్ ఇస్మార్ట్' రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన ఉస్తాద్ హీరో
'డబుల్ ఇస్మార్ట్' మూవీ నిజానికి మార్చి లోనే రిలీజ్ కావాల్సింది. శివరాత్రి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ముందే ప్రకటించారు. కానీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో మార్చి నుంచి వాయిదా వేశారు. అయితే ఇప్పటిదాకా కొత్త రిలీజ్ డేట్ ని మాత్రం ప్రకటించలేదు. ఏప్రిల్ నెలలో పెద్ద సినిమాలు, ఎన్నికల హడావిడి ఉండడంతో రామ్ ఫ్యాన్స్ ఈ సినిమా రిలీజ్ గురించి ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు రామ్. తాజాగా హైదరాబాద్ లో ఓ ఈవెంట్ కి హాజరైన రామ్ జూన్ లో 'డబుల్ ఇస్మార్ట్' మూవీని థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఆ సమయానికి ఎన్నికల హడావిడి అంతా ముగిసిపోతుందని, జూన్‌లో సినిమా రిలీజ్ చేస్తామని తెలిపాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో
'డబుల్ ఇస్మార్ట్' మూవీని ఈసారి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' 2019లో కేవలం తెలుగులోనే రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత హిందీ తో పాటు ఇతర భాషల్లో డబ్ అయి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. అందుకే పూరి అండ్ టీం ఈసారి 'డబుల్ ఇస్మార్ట్' ని తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాతో హీరో రామ్ కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా చార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' కి అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ 'డబుల్ ఇస్మార్ట్' కోసం అంతకుమించి ఊరమాస్ ఆల్బమ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని పాటల కంపోజీషన్ పూర్తయినట్లు సమాచారం.
Also Read : అమెరికా వెళ్ళిపోవడానికి కారణం అదే - సీనియర్ నటి నదియా