Senior Actress Nadhiya  Interview : సీనియర్ నటి నదియా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒకప్పుడు తమిళంలో అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన నదియా టాలీవుడ్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. తెలుగులో వరుసగా అగ్ర హీరోల సినిమాల్లో అమ్మ, అత్త పాత్రలు చేసి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాల్లో నదియా పోషించిన పాత్రలు ఆడియన్స్ కి ఎప్పటికి గుర్తుండిపోతాయని చెప్పడంలో సందేహం లేదు. 'అత్తారింటికి దారేది', 'అ ఆ' వంటి సినిమాల్లో నదియా తన నటనతో ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. అలాంటి ఈ సీనియర్ నటి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరియర్ తో పాటు పర్సనల్ లైఫ్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.


త్రివిక్రమ్ బలవంతంతోనే 'అత్తారింటికి దారేది' లో నటించాను


తెలుగు ఇండస్ట్రీలో 'మిర్చి' నా కంబ్యాక్ ఫిలిం. ఆ సినిమాలో నా పాత్రని ప్రేక్షకులు ఎంతో బాగా యాక్సెప్ట్ చేశారు. కానీ అంతకుమించి ఆదరణ మాత్రం 'అత్తారింటికి దారేది' సినిమాతోనే వచ్చింది. ఈ సినిమాతో క్లాస్, మాస్ ఆడియన్స్ అని తేడా లేకుండా తెలుగు వాళ్లందరికీ ఎంతగానో దగ్గరయ్యాను. నిజానికి అత్తారింటికి దారేది స్క్రిప్ట్ తో త్రివిక్రమ్ నా దగ్గరికి వచ్చి కథ వినిపించి నా క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ చేయాలని నాకు పెద్దగా ఆసక్తి కలగలేదు. ఎందుకంటే అలాంటి తరహా పాత్రులు ఇంతకుముందే చేశానని చెప్పాను. కానీ త్రివిక్రమ్ మాత్రం నన్ను నమ్మండి, ఇందులో అత్త పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని అన్నారు. అయినా నేను నమ్మలేదు. ఎలాగైనా నటించాలని మీరు నన్ను కన్విన్స్ చేస్తున్నారని చెప్పాను. అయినా కూడా నా కోసం ఆయన ఎంతో ఓపికగా ఎదురు చూశారు. చివరికి నన్ను కన్విన్స్ చేసి ఒప్పించారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాత్ర తెలుగులో నన్ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. ఈ విషయంలో త్రివిక్రమ్ గారికి ఎప్పుడు థ్యాంక్ ఫుల్ గా ఉంటాను" అని చెప్పింది.


పెళ్లి తర్వాత అమెరికా వెళ్ళడానికి కారణం అదే


మా హస్బెండ్ అమెరికాలో వర్క్ చేస్తారు. పెళ్లి తర్వాత ఫ్యామిలీతో అమెరికా వెళ్ళిపోయాను. వెళ్లిన తర్వాత అమెరికాలో లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఒక మూడు నెలల టైం తీసుకున్నాను. ఆ తర్వాత మా హస్బెండ్ నన్నెంతో సపోర్ట్ చేసి అక్కడ అసోసియేట్ డిగ్రీ 2 ఇయర్స్ కోర్స్ చేయమని చెప్పారు. ఆయన చెప్పినట్టు 2 ఇయర్స్ ఆ కోర్స్ చేశాను. నా ఎంటైర్ స్కూల్, కాలేజ్ లైఫ్ లో ఎప్పుడూ లేనంతగా రెండు సంవత్సరాలు కష్టపడి కోర్స్ కంప్లీట్ చేశా. అది నాకు ఎంతో గర్వంగా అనిపించింది. ఆ టైంలో నా స్టడీస్, పిల్లలు, ఇంట్లో పనులు.. ఇవన్నీ ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకున్నా. మా హస్బెండ్ కూడా ఎంతో హెల్ప్ చేశారు. దానికి తోడు అమెరికాలో నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ పరిచయమయ్యారు. వారి ద్వారా అమెరికన్ కల్చర్ ఎలా ఉంటుందో నేర్చుకున్నా. అక్కడ ఉన్నన్ని రోజులు చాలా ఎంజాయ్ చేశా" అంటూ చెప్పుకొచ్చింది.


Also Read : ‘రంగస్థలం’కు సీక్వెల్ ఫిక్స్ - ఆరోజే అనౌన్స్‌మెంట్?