Ram Gopal Varma: టాలీవుడ్‌లోని కాంట్రవర్షియల్ దర్శకుడు అని ట్యాగ్ ఎవరికి ఇవ్వాలి అంటే చాలామంది మూవీ లవర్స్ రామ్ గోపాల్ వర్మ పేరే చెప్తారు. తనకు నచ్చింది చేయడం, నచ్చినట్టే ఉండడం, ఎవరు ఏమన్నా పట్టించుకోకపోవడం.. ఇవన్నీ రామ్ గోపాల్ వర్మలోని స్పెషల్ లక్షణాలు. అందరికీ అలా ఉండాలని అనిపించినా ఉండలేరు, కానీ లైఫ్ అంటే ఆర్జీవీదే అని ప్రేక్షకులు అనుకోవడం మనం తరచుగా సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. అలాంటి ఆర్జీవీకి బాధ ఉండదా అని అడిగితే ఆయన ఒక ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తన జీవితంలో ఎక్కువగా బాధపడి ఏడ్చిన సందర్భాన్ని బయటపెట్టారు.


సైకాలజీ అలాగే ఉంటుంది..


ముందుగా మీలో రాము, ఆర్జీవీ అని రెండు పర్సనాలిటీలు ఉన్నాయి అంటూ ఒక ఫ్యాన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దానిపై వర్మ స్పందించారు. ‘‘రెండు పర్సనాలిటీలు లాంటివి ఏం లేవు. ఆ విషయంలో మీరు తప్పు. మామూలుగా ఒక విషయంలో నేను చాలా ఎమోషనల్ అవ్వచ్చు. కానీ వెంటనే అయిదు నిమిషాల్లో నేను ఇంకేదో పనిచేస్తుంటాను. చిరుత వచ్చి జింకను తినేస్తే అయ్యో జింక అనుకుంటాం. అదే హైనా వచ్చి చిరుతను తరిమేస్తే చిరుతను చూసి జాలిపడతాం. సెంటిమెంట్ సైకాలజీ అలాగే తిరుగుతూ ఉంటుంది. నేను కూడా అప్పుడప్పుడు ఆ సెంటిమెంట్ ట్రాప్‌లో పడినా.. వెంటనే బయటికి వచ్చేస్తాను’’ అంటూ బాధపడడంపై తన సిద్ధాంతాన్ని బయటపెట్టారు ఆర్జీవీ.


నేను కూడా అంతే..


ఎప్పుడైనా ఏడ్చారా అని రామ్ గోపాల్ వర్మను అడగగా.. ‘‘నేను ఏడుస్తాను. కానీ నా ఏడుపు ఉండేది చాలా తక్కువసేపే. ఉదాహరణకు అయన్ ర్యాండ్‌పై తెరకెక్కించిన ‘ఏ సెన్స్ ఆఫ్ లైఫ్’ అనే డాక్యుమెంటరీ చూశాను. అది అయిపోయేసరికి నేను విపరీతంగా ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నానో కూడా అర్థం కాలేదు. అక్కడ ఏం ట్రాజిడీ జరగడం లేదు. ఏడ్చే అంత విషయం ఏమీ లేదు అందులో. కానీ తను నాకు చాలా నచ్చింది. అది నన్ను చాలా సంతోషపెట్టింది. అలాంటి ఒక మనిషి ఒకప్పుడు ఈ భూమిపై ఉంది అనేది నాపై చాలా ఎఫెక్ట్ చూపించింది. నేను రియాక్ట్ అయితే అలా ఉంటుంది. ఎమోషన్ అనేది నీ సెన్సేస్‌ను మర్చిపోయేలా చేసేదే తప్పా ఇంకేమీ కాదు. మీరు అది ఫీల్ అవ్వడానికి ఇష్టపడతారు. నేను కూడా అంతే’’ అంటూ తను ఏడ్చిన సందర్భాన్ని బయటపెట్టారు ఆర్జీవీ.


‘వ్యూహం’పై ఫోకస్..


ఒకప్పుడు ఎన్నో క్లాసిక్ హిట్ సినిమాలు తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ.. ప్రస్తుతం కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌లాగా మారిపోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కౌంటర్లు వేస్తూ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలోనే తను డైరెక్ట్ చేసిన ‘వ్యూహం’ అనే చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఫిబ్రవరీ 23న ‘వ్యూహం’ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో అజ్మల్ అమీర్.. వైఎస్ జగన్ పాత్రలో కనిపించనున్నాడు. తన భార్య భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటించింది. ధనుంజయ్ ప్రభూన్, సురభి ప్రభావతి, రేఖ సురేఖ, వాసు ఇంటూరి, కోటా జయరాం వంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.


Also Read: స్మశానవాటికలో టీజర్ లాంచ్ - ఇదెక్కడి మాస్ ప్లానింగ్ మావా బ్రో!