Vyuham Movie Release : ఒకప్పుడు కమర్షియల్ సినిమా రూపురేఖలనే మార్చేసిన రామ్ గోపాల్ వర్మ.. గత కొన్నేళ్లుగా కేవలం కాంట్రవర్షియల్ కథల వెనుక పరిగెడుతున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో జరుగుతున్న కాంట్రవర్సీలనే ఆయన కథలుగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆయన రెండేళ్ల నుంచి కష్టపడి తెరకెక్కించిన సినిమా ఒకటి.. థియేటర్లలో విడుదల కానుంది అంటూ ఆసక్తికర పోస్ట్‌ను షేర్ చేశారు ఆర్జీవీ. ఇప్పటికే పలు పొలిటికల్ కాంట్రవర్షియల్ కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్జీవీ.. మరోసారి అదే కథను కాస్త డిఫరెంట్‌గా చెప్పడానికి సిద్దమవుతున్నారు.


ఫైనల్‌గా థియేటర్లలోకి..
వైఎస్ఆర్ మరణించిన తర్వాత రాజకీయాల్లో జరిగిన కీలక మార్పులు ఏంటో చూపించడం కోసం ‘వ్యూహం’ సినిమాను తెరకెక్కించారు రామ్ గోపాల్ వర్మ. ఇందులో ఎంచుకున్న నటీనటులు కూడా ఆయా పాత్రలకు సరిగ్గా సరిపోయేలా ఉన్నారనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే ‘వ్యూహం’ నుంచి రెండు టీజర్లు, ట్రైలర్ విడుదలయ్యాయి. కానీ ఇవన్నీ ముఖ్యంగా పాత్రల పరిచయాలపైన మాత్రమే ఆధారపడి ఉన్నాయి. అసలు ఈ సినిమాతో ఆర్జీవీ ఏం చెప్పాలనుకుంటున్నారు అనే విషయం టీజర్, ట్రైలర్‌లలో పూర్తిగా రివీల్ చేయలేదు. ఇక ఫైనల్‌గా ‘వ్యూహం’ థియేటర్లలోకి వచ్చేస్తుందని అప్డేట్ అందించారు వర్మ.


చేదు వార్త..
‘‘చెడ్డవారికి చేదు వార్త. వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్. డిసెంబర్ 29న థియేటర్లలో’’ అని ‘వ్యూహం’ మూవీ సెన్సార్ సర్టిఫికెట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆర్జీవీ. ఫైనల్‌గా ఎప్పటినుండో విడుదలకు నోచుకోని ఈ సినిమా థియేటర్లలోకి వస్తున్నందుకు ఆర్జీవీ ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు. డిసెంబర్ చివర్లో పలు తెలుగు సినిమాలు థియేటర్లలో భారీ ఎత్తున విడుదలకు ప్లాన్ చేస్తుండగా.. వాటన్నింటికీ పోటీగా ‘వ్యూహం’ను వదలాలి అనుకుంటున్నారు వర్మ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ నడుస్తుండడంతో ఇదే సమయంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనే ఉద్దేశ్యంతో డిసెంబర్ 29న రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారేమో అని ప్రేక్షకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.






మళ్లీ అదే నటీనటులతో..
రామ్ గోపాల్ వర్మ ఇంతకు ముందు కూడా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌పై ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. దాదాపు అందులో నటించిన నటీనటులనే ‘వ్యూహం’ కోసం కూడా రిపీట్ చేసినట్టు తెలుస్తోంది. అందులో వైఎస్ జగన్ పాత్రలో నటించిన అజ్మల్ అమీర్.. ఇందులో కూడా అదే పాత్ర చేస్తున్నాడు. తన భార్య భారతి పాత్రలో మానసా రాధాకృష్ణన్ కనిపించనుంది. ఇతర ముఖ్య పాత్రల్లో ధనుంజయ్  ప్రభూనే, సురభి ప్రభావతి, రేఖా నిరోషా, వాసు ఇంటూరి, కోటా జయరామ్, ఎలినా నటించారు. ఇక ఈ చిత్రాన్ని దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఆర్జీవీ తెరకెక్కించిన ‘వ్యూహం’ కచ్చితంగా ఏపీ పాలిటిక్స్‌పై ప్రభావం చూపిస్తుందని తన ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరి విడుదల తర్వాత ఈ మూవీ ఇంకా ఎన్ని కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుందో చూడాలి.


Also Read: దుబాయ్‌ క్లబ్‌లో గొడవ, చంపేస్తామంటూ పూజా హెగ్డేకు బెదిరింపులు - ఇందులో నిజమెంత?