RGV vs Natti Kumar: ప్రముఖ దర్శక - నిర్మాత రామ్ గోపాల్ వర్మ, నట్టి కుమార్ మధ్య కొన్ని రోజులుగా గొడవ జరుగుతోంది. అది కోర్టు మెట్లు ఎక్కింది. వర్మ తనకు డబ్బులు ఇవ్వాలని, అవి ఇచ్చే వరకు 'మా ఇష్టం' (డేంజరస్ / ఖత్రా) విడుదల కాకుండా చూడాలని నట్టి కుమార్ కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడంతో ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా రాలేదు.


'మా ఇష్టం' (Maa Ishtam / Dangerous) సినిమా విడుదలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత తన సంతకాలను నట్టి కుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్జరీ చేశారని వర్మ ఆరోపించారు. మరోవైపు నట్టి కుమార్ వివిధ మీడియా సంస్థల్లో తనలా చాలా మందికి వర్మ డబ్బులు ఎగ్గొట్టారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తన పరువుకు భంగం వాటిల్లేలా ప్రవర్తించిన నట్టి కుమార్ అండ్ కోపై కేసులు పెట్టడానికి ఆర్జీవీ రెడీ అయ్యారు.


హైదరాబాద్‌లోని కొంతమంది టాప్ లాయర్లు, సీనియర్ పోలీస్ ఆఫీసర్లతో వర్మ సమావేశమైనట్టు తెలిసింది. రాజకీయ నాయకులను కూడా కలిశారట. ఎలాంటి న్యాయపరమైన సూత్రాలు పాటించకుండా ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిన సివిల్ కోర్ట్ జడ్జ్ మీద తెలంగాణ హైకోర్టుకు ఫిర్యాదు చేయడానికి రామ్ గోపాల్ వర్మ రెడీ అయినట్టు సమాచారం. ఆ కంప్లయింట్ కాపీని సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణకు పంపించాలని డిసైడ్ అయ్యారట.


Also Read: కరీనా కపూర్ బొట్టు ఎక్కడ? హిందువులను అవమానించడమే - ట్రోలింగ్ గురూ


నట్టి కుమార్, ఆయన పిల్లలు కరుణ, క్రాంతిపై క్రిమినల్ ఫోర్జరీ, సైబర్ క్రైమ్ కేసులు పెట్టడంతో పాటు పరువు నష్టం, ఆర్థిక నష్టం దావా వేయాలని రామ్ గోపాల్ వర్మ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 'మా ఇష్టం' సినిమాపై కింద కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ ను హైకోర్టు కొట్టివేయడంతో మే 6న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


Also Read: డీ గ్లామర్ రోల్‌లో కీర్తీ సురేష్ - టీజర్‌లో ఇంత ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటే సినిమాలో ఎలా ఉంటుందో?