బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమాల్లో ప్లాప్స్ కొన్ని ఉన్నాయి. అయితే, 'సర్కార్' కల్ట్ క్లాసిక్ అనిపించుకుంది. దానికి సీక్వెల్స్‌గా వచ్చిన రెండు సినిమాలూ హిట్టే. అమితాబ్ - వర్మ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఆ కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది.
Amitabh Bachchan - Ram Gopal Varma New Movie Update: ''అమితాబ్ బచ్చన్ గారితో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాను. హారర్ జానర్ ఫిల్మ్ అది. బహుశా... నవంబర్ నెలలో స్టార్ట్ కావచ్చు'' అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా 'కొండా' జూన్ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన వర్మ ఈ విషయం వెల్లడించారు.
Also Read: కశ్మీర్ లో పండిట్స్ ను చంపారు, ఇక్కడ ముస్లింను కొట్టారు - సాయిపల్లవి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్!
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వర్మ తీసిన 'లడకీ' సినిమా కూడా హిందీలో విడుదల కానుంది. మార్షల్ ఆర్ట్స్ కంటే ప్రధాన పాత్రధారి గ్లామర్ మీద దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టారని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేస్తున్నారు. అది పక్కన పెడితే... అమితాబ్ సినిమా మళ్ళీ వర్మను టాప్ లీగ్‌లోకి తీసుకు వస్తుందని ఆయన అభిమానులు అంటున్నారు.
Also Read: విజయ దశమికి థియేటర్లలో చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ? ఆ రెండు సినిమాల మధ్య పోటీ?