Ram Gopal Varma : కాంట్రవర్శియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ.. ఏది చేసినా కొత్తగానే ఆలోచిస్తాడు. ఈ ప్రపంచంలో తనకు మాత్రమే నిజమైన స్వేచ్ఛ ఉందనేలా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎవరికీ భయపడకుండా, నచ్చింది చేసుకుంటూ వెళ్లిపోవడమే తన నినాదంగా సాగిపోతూ ఉంటాడు. అయితే ఆయనకి అసలు ఎమోషన్స్ అనేవే ఉండవని చాలా మంది అంటుంటారు. ఆయన తీసే సినిమాల్లోనూ అదే విషయాన్ని ప్రస్ఫుటించేలా చూపిస్తాడు. చావు, పుట్టుక వంటి విషయాలపై తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకసలు చావు అంటేనే ఇష్టం ఉండదని, ఎవరైనా చనిపోతే కూడా అలా ఏడ్వడం నచ్చదంటూ కామెంట్ చేశారు.


"నా కాలేజ్ ఫ్రెండ్ లో ఒకతని తల్లి ఈ మధ్యే చనిపోయింది. అప్పుడు నాకొక మేసేజ్ పెట్టాడు. కానీ నేను దానికి రిప్లై ఇవ్వలేదు. ఓ పది రోజుల తర్వాత మళ్లీ మెసేజ్ చేశాడు. తన తల్లి పోయిందని చెప్పినా కూడా ఈ సమయంలోనూ రిప్లై ఇవ్వలేదు అని ఫీలయ్యాడు. అప్పుడు నేను చెప్పిందేంటంటే.. నాకసలు డెత్ అంటే ఇష్టం ఉండదు. డెత్ అనే ఇష్యూకు నేనెప్పుడూ రియాక్ట్ కాను. మా నాన్న చనిపోయినప్పుడు కూడా ఇంటికి చుట్టాలొచ్చి ఏడ్వడం, చూడడం ఇష్టం లేదని మా అమ్మతో చెప్పాను. ఇంట్లో మా నాన్న ఫొటో కూడా ఎక్కడ పెట్టడానికి వీల్లేదని చెప్పాను. ఎందుకంటే ఆ ఫొటో చూసినప్పుడల్లా మా నాన్న గారు లేరనే విషయం మాటిమాటికీ గుర్తొస్తుంది. అలా గుర్తు చేసుకుని, బాధపడడం నాకిష్టం లేదు. అది చూసేవాళ్లకు ఏదైనా అనిపించొచ్చు. కానీ అది నా నిర్ణయం" అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.


అమితాబ్ బచ్చన్ తనకు చాలా క్లోజ్ అన్న రామ్ గోపాల్ వర్మ.. "ఓ సారి ఆయన మదర్ చనిపోయినపుడు అందరూ వెళ్లినా కూడా నేను మాత్రం వెళ్లలేదు. ఆ తర్వాత 6,7 రోజుల వరకు ఆయన్ను కలవలేదు. ఒకవేళ కలిసినా ఆ డెత్ గురించి పూర్తిగా వదిలేశాను. మాట్లాడినా కూడా జోక్స్ చేస్తూ మాట్లాడేవాణ్ణి. అది నా పర్సనల్. నాకేంటంటే ఒక ఇల్యూషన్ ప్రపంచంలో అంతా అందంగా ఉంది. నాకు ఏ ప్రాబ్లెమ్ లేదు అని నాకు నేనే క్రియేట్ చేసుకున్నాను. అందులోకి డెత్, డిసీజ్ వంటివి తీసుకురావడం నాకిష్టం లేద"ని రామ్ గోపాల్ వర్మ తన అభిప్రాయాలను పంచుకున్నారు.


నేనొక మోడ్రన్ యోగిని..


"నేనొక యోగినే కానీ.. యోగి అంటే గడ్డం, మీసం అవన్నీ ఉంటాయి. కానీ నాకు అలాంటివేం ఉండవు. నేనొక మోడ్రన్ యోగిని. ఒక్క మాటలో చెప్పాలంటే నేనొక రొమాంటిక్ యోగిని. ఇక మీసం గురించి చెప్పాలంటే మీసం లేకపోతే నేను బాగుండనేమో అని అనుమానం. అందుకని అంత రిస్క్ తీసుకోవడం ఎందుకని..." అంటూ ఆర్జీవీ నవ్వుతూ చెప్పారు.


Read Also : Maya Petika Movie Review - 'మాయా పేటిక' రివ్యూ : ఒక్క టికెట్ మీద ఆరు షోలు - సెల్ ఫోన్ బయోపిక్ ఎలా ఉందంటే?