గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) రేర్ రికార్డ్ క్రియేట్ చేశారు. అతి త్వరలో ఆయన వాక్స్ స్టాట్యూ (మైనపు విగ్రహం) మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ఘనత అందుకుంటున్న తొలి టాలీవుడ్ హీరోగా రామ్ చరణ్ రేర్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు. అరుదైన ఘనత అందుకోబోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...


లండన్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో...
మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ (టాలీవుడ్) నుంచి కొంత మంది స్టార్ హీరోల మైనపు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అయితే... అవి అన్నీ వేర్వేరు దేశాల్లో ఉన్నాయి. ఫర్ ద ఫస్ట్ టైమ్... లండన్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఒక తెలుగు హీరో మైనపు విగహాన్ని ఏర్పాటు చేయనున్నారు.


మేడమ్ టుస్సాడ్స్ పుట్టిన ఇల్లు అయిన లండన్ మ్యూజియంలో అడుగు పెడుతున్న మొదటి తెలుగు హీరోగా రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఆయనకు మూగ జీవాలు అంటే అమితమైన ప్రేమ. ఆ విషయం అభిమానులు, ప్రేక్షకులకు తెలుసు. ఆయన దగ్గర గుర్రాలు, కుక్క పిల్లలు, ఆవులు, బాతులు వంటివి ఉన్నాయి. అయితే... రైమ్ (పెంపుడు కుక్క) రామ్ చరణ్, ఉపాసనతో ఎక్కువ కనబడుతుంది. ఆ కుక్కపిల్లతో కలిసి ఉన్న రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు.


Also Readఐఫా 2024 విన్నర్స్ లిస్ట్... చిరుకు స్పెషల్, నానికి బెస్ట్ యాక్టర్, బాలయ్యకు ఏ అవార్డు వచ్చిందో తెలుసా?






రామ్ చరణ్ కంటే ముందు ఎవరున్నారు?
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అడుగు పెట్టిన మొదటి తెలుగు హీరో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన మైనపు విగ్రహం బ్యాంకాక్ మ్యూజియంలో పెట్టారు. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం ఉంది. ఆ మ్యూజియంలోనే అతిలోక సుందరి శ్రీదేవి మైనపు విగ్రహాన్ని సైతం ఉంచారు. ఆమె నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'మిస్టర్ ఇండియా'లో గెటప్ తీసుకుని ఆ విగ్రహం రూపొందించారు. తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ మైనపు బొమ్మ సైతం అక్కడే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.


Also Readవెంకీ మామతో దేవిశ్రీ స్టెప్పులు - ఐఫా 2024లో గ్లామరస్ పెర్ఫార్మన్స్‌లు... ఫోటోలు చూడండి



మరి, బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరెవరు ఉన్నారు?
బాలీవుడ్ సెలబ్రిటీలలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బాద్షా షారుఖ్ ఖాన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ బచ్చన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, కరీనా కపూర్ ఖాన్, స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ సహా మరి కొందరి మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఉన్నాయి. వీరిలో కొందరివి లండన్‌లో, ఇంకొంత మంది విగ్రహాలు సింగపూర్, దుబాయ్ మ్యాజియమ్స్‌లో ఉన్నాయి.