'దేవర'తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) భారీ రికార్డులు కొడుతున్నారు. ఏపీ, తెలంగాణలో మొదటి రోజు / ఓపెనింగ్ డే కలెక్షన్లలో 'ఆర్ఆర్ఆర్' హయ్యస్ట్ షేర్ సాధించిన సినిమాగా చరిత్రకు ఎక్కింది. అందులో ఎన్టీఆర్ హీరో. ఇప్పుడు సోలో హీరోగా 'దేవర'తో సెకండ్ హయ్యస్ట్ షేర్ సాధించిన సినిమా రికార్డు కూడా తన పేరు మీద రాసుకున్నారు. 'దేవర' ఫస్ట్ డే షేర్ రూ. 54.21 కోట్లు కాగా... రెండో రోజు కూడా మంచి నంబర్స్ నమోదు చేసింది. రెండో రోజు ఏ ఏరియాలో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? అంటే...
ఏపీ, తెలంగాణలో 'దేవర' సెకండ్ డే షేర్!
Devara Day 2 Collection In AP and Telangana: తొలి రోజు బెనిఫిట్ షోస్ భారీ సంఖ్యలో పడ్డాయి. దానికి తోడు టికెట్ రేట్స్ కూడా ఎక్కువ. రెండో రోజు నుంచి తెలంగాణలో రేట్లు కాస్త తగ్గాయి. అందుకని, నంబర్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. కానీ, మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఏరియాల వారీగా మొదటి రోజు 'దేవర' ఎంత కలెక్ట్ చేసింది? రెండో రోజు ఎంత కలెక్ట్ చేసింది? అనేది చూస్తే...
ఏరియా | ఫస్ట్ డే | సెకండ్ డే | రెండు రోజుల టోటల్ షేర్ |
నైజాం (తెలంగాణ) | రూ. 19.32 కోట్లు | రూ. 6.94 కోట్లు | రూ. 26.26 కోట్లు |
సీడెడ్ (రాయలసీమ) | రూ. 10.40 కోట్లు | రూ. 3.77 కోట్లు | రూ. 14.17 కోట్లు |
విశాఖ | రూ. 5.47 కోట్లు | రూ. 1.68 కోట్లు | రూ. 7.15 కోట్లు |
తూర్పు గోదావరి | రూ. 4.02 కోట్లు | రూ. 86 లక్షలు | రూ. 4.88 కోట్లు |
పశ్చిమ గోదావరి | రూ. 3.60 కోట్లు | రూ. 48 లక్షలు | రూ. 4.08 కోట్లు |
కృష్ణ | రూ. 3.02 కోట్లు | రూ. 95 లక్షలు | రూ. 3.97 కోట్లు |
గుంటూరు | రూ. 6.27 కోట్లు | రూ. 0.82 లక్షలు | రూ. 7.09 కోట్లు |
నెల్లూరు | రూ. 2.11 కోట్లు | రూ 62 లక్షలు | రూ. 2.73 కోట్లు |
ఏపీ, తెలంగాణ (టోటల్) | రూ. 54.21 కోట్లు | రూ. 16.12 కోట్లు | రూ. 70.33 కోట్లు |
Also Read: వెంకీ మామతో దేవిశ్రీ స్టెప్పులు - ఐఫా 2024లో గ్లామరస్ పెర్ఫార్మన్స్‌లు... ఫోటోలు చూడండి
'దేవర' సినిమాకు రెండో రోజు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వచ్చాయి. టికెట్ రేటు మీద జీఎస్టీ యాడ్ చేయకుండా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 70.33 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఫస్ట్ వీకెండ్ భారీ రికార్డ్స్ నమోదు చేసే దిశగా వెళుతోంది. మూడో రోజు కూడా అడ్వాన్స్డ్ బుకింగ్స్ బావున్నాయి.
మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుగా!
Devara First Day Collection Worldwide: 'దేవర' మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ బరిలో 172 కోట్ల రూపాయల షేర్ సాధించింది. హిందీలో మొదటి రోజు రూ. 7 కోట్ల నెట్ సాధించగా... రెండో రోజు 10 కోట్లకు పైగా వసూలు చేసిందని సమాచారం. హిందీలో కలెక్షన్ రోజు రోజుకూ పెరుగుతున్నాయి.