ఈ మధ్య బిగ్‌స్క్రీన్‌పై కామెడీ కింగ్ బ్రహ్మానందం సందడి పెద్దగా కనిపించడం లేదు. కరోనా నుంచి అడపదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నారు. ఒకప్పుడు ఏడాదికి పదికి మించి సినిమాలు చేసే ఆయన కరోనా నుంచి ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన ఆయన ఆర్ట్‌తో పాటు తన జీవితాన్ని పుస్తకం రూపంలో పొందుపరుకున్నారు. 'నేను.. మీ బ్రహ్మానందం' పేరుతో స్వయంగా ఆత్మకత రాసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలె ఈ బుక్‌ను రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఈ బుక్‌ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్స్‌ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంది. తాజాగా బ్రహ్మానందం బుక్‌ను గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రమోట్‌ చేస్తూ ఓ ట్వీట్‌ చేశాడు. 






హాస్యం, మనసుతో నిండిందే 'నేను': చరణ్‌


బ్రహ్మానందం స్వయంగా రాసుకున్న ఆత్మకథను మెగాస్టార్‌ చిరు తన చేతుల మీదుగా అందించిన సంగతి తెలిసిందే. అలాగే గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు కూడా అందించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోను చరణ్‌ తన ట్వీట్‌లో షేర్‌ చేశాడు. అలాగే నేను పుస్తకాన్ని ప్రమోట్ చేస్తూ ప్రతి ఒక్కరు చదవాల్సిన ఆటోగ్రాఫ్‌ అని పేర్కొన్నారు. అంతేకాదు ఈ బుక్‌ సారాంశం చెబుతూ అందరికి పరిచయం చేశాడు. "నేను.. అనేది బ్రహ్మనందం గారికి అపురూపమైన జీవితం ప్రయాణం, హాస్యం.. మనసుతో నిండినదే ఆయన ఆత్మకథ. ప్రతి పేజీ సినిమా మనోజ్ఞతను కలిగి ఉన్నాయి. దానితో పాటు ఆయన జీవిత పాఠాలు.. నవ్వులు, సినిమా అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాలు కలిగి ఉన్నాయి" అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కొని చదవాల్సిందిగా కోరుతూ సదరు వెబ్‌సైట్ లింక్‌ను షేర్‌ చేశాడు. 


నేను..లో ఏముందంటే..


తెలుగు భాష .. సాహిత్యంపై మంచి పట్టున్న బ్రహ్మనందం మొదట తెలుగు మాస్టారుగా పనిచేసిన సంగతి తెలిసిందే. నాలుగు గోడల మధ్య పాఠాలు చెప్పుకునే ఆయన ప్రేక్షకులను నవ్వించేందుకు నటన దిశగా అడుగుల వేశారు. ముఖానికి రంగు వేసుకుని వినోదం పంచారు. అలా కమెడియన్‌ పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో లెజెండరి, హాస్య బ్రహ్మగా ముద్ర వేసుకున్నారు. అలా తన లెక్చరర్‌ నుంచి హాస్య బ్రహ్మగా పద్మశ్రీ అందుకున్న తన జీవితాన్ని నేను.. మీ బ్రహ్మానందం పేరుతో అందరికి అందించారు.


ఇందులో తన జీవితంలోని అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాలను పంచుకున్నారు. ఎక్కడో మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో జన్మించిన ఆయన దాతల సాయంతో చదువు పూర్తి చేశారు. తనకు సాయం చేసిన వాళ్ల ఇళ్లలో చిన్నపాటి పనులు చేస్తూ ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. వైజాగ్‌ ఆంధ్ర యూనివర్శిటీలో MA తెలుగులో పిజీ చదివి.. ఆ తర్వాత తెలుగు పండితుడిగా పాఠాలు బోధించారు. అదే సమయంలో ఓ మూవీ షూటింగ్‌లో చిరంజీవి కంటపడ్డ బ్రహ్మానందాన్ని సినీ రంగానికి పరిచయం చేశారు మెగాస్టార్‌. అలా జంధ్యాల గారి ఆహా పెళ్లంటా సినిమాతో కమెడియన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలా తన జీవితంలోని అనుభవాలు, అనుభూతులు, కష్టాలు, ఒడిదుడుకులను 'నేను.. మీ బ్రహ్మానందం' అంటూ ఆటోగ్రాఫ్ రాసుకున్నారు.  


Also Read: ఇది ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకం - మహేష్‌ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌