2024 Heroines: ఒక సినిమా చేతిలోకి రావాలంటే దానికి ఎంతో కష్టపడాలి. చిన్న చిన్న సినిమాలన్నీ చేసుకొని స్టార్ డం తెచ్చుకొని పెద్ద హీరోలతో సినిమాలు చేసి విడుదలకు దగ్గరగా వస్తున్న 2024లో బిజియస్ట్ హీరోయిన్లు ఎవరో ఈరోజు చూద్దాం..
వింటేజ్ భామలు..
హీరోయిన్ అంటే ఇండస్ట్రీలో ఐదారేళ్ల వరకు బిజీగా ఉండి తర్వాత అవకాశాలు లేకుండా ఉన్న వాళ్లే ఎక్కువ ఉన్నారు. కానీ ఈ భామలు మాత్రం గత 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలోనే అతుక్కుపోయి ఉన్నారు. త్రిష, నయనతారలు ఇద్దరు ఎప్పటినుంచో సినీ ఇండస్ట్రీలో ఉన్నవారే. అయితే మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నా సరే ఈ సంవత్సరం మంచి ఫామ్ లోకి వచ్చారు. కిందటి సంవత్సరం P.S 2, లియో వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ ని అందుకున్న త్రిష ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా అలాగే కమల్ హాసన్, మణిరత్నం కలిసి చేస్తున్న తగ్ లైఫ్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక నయనతార విషయానికి వస్తే షారుక్ ఖాన్ తో జవాన్ సినిమాలో మెరిసిన నయనతార ఈ సంవత్సరం బాలీవుడ్ లో రెండు చిత్రాలను సైన్ చేసింది. ఈ వింటేజ్ భామలు గ్యాప్ తర్వాత వచ్చిన గ్యాప్ ఇవ్వకుండా డ్యూటీ చేసుకుంటున్నారు.
కెరీర్ స్టార్టింగ్ లోనే..
కొంత మంది హీరోయిన్లకు మంచి స్టార్ డం దక్కాలంటే వాళ్ళు ఎన్నో సినిమాలు చేసుకొని రావాలి. కానీ ఈ ఇద్దరు భామలు మాత్రం కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి పేరుని అందుకున్నారు. వాళ్లే శ్రీ లీల, మీనాక్షి చౌదరి. శ్రీ లీల కిందటి సంవత్సరం ఏకంగా ఐదు సినిమాలలో నటించింది. అందులో రెండు బ్లాక్ బస్టర్లు అయ్యి మిగిలిన మూడు ఫ్లాప్ అయ్యాయి. కానీ ఈ సంవత్సరం ఏకంగా మహేష్ బాబు తోనే సినిమా చేస్తుంది. గుంటూరు కారం సినిమా తర్వాత కూడా శ్రీ లీలకు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇదిలా ఉండగా మీనాక్షి చౌదరి కూడా హిట్ 2 సినిమా తర్వాత గుంటూరు కారంలో నటిస్తుంది. దీని తర్వాత దళపతి విజయ్ తో G.O.A.T సినిమాలో కూడా నటిస్తూ మంచి బిజీ అయిపోతుంది .ఈ ఇద్దరు యువతారలు ఈ సంవత్సరం మంచి జోరు మీద ఉన్నారు.
బ్రేక్ లే లేవు..
మృణాల్ ఠాకుర్ విషయానికొస్తే హాయ్ నాన్న సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మృణాల్ ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో విడుదలకు దగ్గరగా వస్తుంది. అలాగే సాయి పల్లవి నాగచైతన్యతో కలిసి తండేల్ అనే సినిమాలో అలరించబోతుంది. ఇంక పూజ హెగ్డే విషయానికొస్తే... ముందు గుంటూరు కారం చేయవలసింది. కానీ, అనుకొని పరిస్థితిలో ఆ పాత్ర మీనాక్షికి వచ్చింది. ఒకవేళ త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కలిసి సినిమా చేసే అవకాశం ఉంటే... అందులో పూజయే హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నది. అయితే ఈ సంవత్సరం బిజీగా ఉండే భామల లిస్టులో వీళ్ళతో పాటు రష్మిక మందన్న కూడా ఉంది. ద గర్ల్ ఫ్రెండ్, పుష్ప 2తో పాటు హిందీ సినిమాలతో ఈ సంవత్సరం అలరించనుంది రష్మిక.
Also Read: క్రేజ్ ఎక్కువ, బిజినెస్ తక్కువే - 'హనుమాన్'ను ఎన్ని కోట్లకు అమ్మారంటే?