Ram Charan Varun Tej Sai Durgha Tej Trending Photo: మెగా హీరోస్ ఒకే ఫ్రేమ్‌లో సందడి చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్ ముగ్గురూ కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిమ్‌లో వ్యాయామం అనంతరం ముగ్గురూ కలిసి దిగిన ఫోటోను మెగా హీరో వరుణ్ తేజ్ తన ఇన్ స్టా హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు.

'వీకెండ్‌లో సరదాగా...' అంటూ వరుణ్ తేజ్ క్యాప్షన్ ఇవ్వగా... దీన్ని చూసిన అభిమానులు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముగ్గురు మొనగాళ్లని వారి లేటెస్ట్ మూవీస్‌తో పాటు షేర్ చేస్తుండగా... 'పెద్ది' మూవీ మరోసారి ట్రెండ్ అవుతోంది. హీరోల అభిమానులు కొత్త సినిమాల టైటిల్స్‌తో హ్యాష్ ట్యాగ్ యాడ్ చేస్తున్నారు. దీంతో 'పెద్ది'తో పాటు అవి కూడా ట్రెండ్ అవుతున్నాయి.

Also Read: విజయ్ దేవరకొండతో హరీష్ శంకర్ మూవీ? - ఈ క్రేజీ కాంబో అస్సలు ఊహించి ఉండరు

ట్రెండింగ్‌లో 'పెద్ది' మూవీ

ఈ ఫోటోతో ప్రస్తుతం 'పెద్ది' మూవీ ట్రెండింగ్‌లో నిలిచింది. శనివారం కూడా సోషల్ మీడియాలో #Peddi ట్రెండ్ అయ్యింది. ఈ మూవీలో స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్‌ చేయనున్నారనే వార్తల నేపథ్యంలో ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే, సమంత స్పెషల్ సాంగ్‌‌పై మూవీ టీం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం 'పెద్ది' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండగా... చరణ్ సరసన అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తున్నారు.

కీలక యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, అర్జున్ అంబటి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా... వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో ఈ స్టోరీ సాగనున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో 2026, మార్చి 27న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక వరుణ్ తేజ్ లాస్ట్‌‌గా 'మట్కా' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా... అది అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఆయన తన 15వ మూవీ మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో చేస్తున్నారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఇండో కొరియన్ హారర్ కామెడీ మూవీగా ఇది తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. వరుణ్ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి 'కొరియన్ కనకరాజు' అనే టైటిల్ పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

'విరూపాక్ష'తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు సాయి దుర్గా తేజ్. ఆయన తర్వాత మూవీ 'సంబరాల ఏటిగట్టు' రోహిత్ కె.పి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు ఇదే ఫస్ట్ మూవీ. పాన్ ఇండియా లెవల్‌లో మూవీని తెరకెక్కిస్తుండగా... ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా చేస్తుండగా... జగపతిబాబు, శ్రీకాంత్, అనన్య నాగళ్ల, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.