Vijay Deverakonda Movie With Harish Shankar: టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబోస్‌ను ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు అలాంటి కాంబోలోనే ఓ మూవీ రాబోతుందనే బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ హీరోతో స్టార్ డైరెక్టర్... ఇదివరకు ఎప్పుడూ చేయని బ్యానర్‌లో ఆ డైరెక్టర్ మూవీ తీయబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి ఎవరా హీరో? ఎవరా డైరెక్టర్? ఆ బ్యానర్ ఏంటి? అనే వివరాలు ఓసారి చూస్తే...
విజయ్ దేవరకొండతో...
యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'కింగ్డమ్' మూవీ సక్సెస్ జోష్‌లో ఉన్నారు. ఆయనతో డైరెక్టర్ హరీష్ శంకర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది ఎప్పుడు ట్రాక్ ఎక్కుతుంది అనే దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం విజయ్ లైనప్‌లో రెండు మూవీస్ ఉన్నాయి. ఒకటి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో స్టార్ట్ కాబోతుండగా... ఈ ప్రాజెక్ట్ తర్వాత రవికిరణ్ కోలాతో ఓ సినిమా చేయాల్సి ఉంది.
ప్రస్తుతం... హరీష్ శంకర్ పవన్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' చేస్తుండగా... ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీలో పవన్ పార్ట్ షూటింగ్ ఇటీవలే కంప్లీట్ చేశారు. మిగిలిన షూటింగ్‌పై హరీష్ ఫోకస్ చేశారు. పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా చేస్తున్నారు. మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'గబ్బర్ సింగ్' తర్వాత అలాంటి క్రేజీ కాంబో రిపీట్ అవుతుండడంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
Also Read: షూటింగ్స్ బంద్... వేతనాల పెంపునకు ఓకే బట్ కండీషన్స్ అప్లై - నో చెప్పిన ఫెడరేషన్ నేతలు
వెయిట్ చేస్తారా?
ఈ సినిమా పూర్తైన తర్వాత హరీష్ తన నెక్స్ట్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టనున్నారు. ఇందులో భాగంగానే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో విజయ్ దేవరకొండతో మూవీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. మరి విజయ్ 2 మూవీస్ పూర్తయ్యే వరకూ హరీష్ వెయిట్ చేస్తారా? లేక ఆల్టర్నేట్ ఏమైనా చూస్తారా? అనేది ఆసక్తిగా మారింది. నిజానికి హరీష్‌కు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అంతగా సాన్నిహిత్యం లేదనేది ఫిలిం నగర్ వర్గాల మాట. గతంలోనూ తాను సినిమాలు చేస్తే హారిక & హాసిని క్రియేషన్స్‌కు చేస్తానని హరీష్ ఆఫ్ ది రికార్డ్ చెప్పారనే టాక్ వినిపించింది.
నిజానికి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, హారిక & హాసిని క్రియేషన్స్ రెండు వేర్వేరు నిర్మాణ సంస్థలు కాగా... సితార సంస్థ సూర్యదేవర నాగవంశీ ఆధ్వర్యంలో నడుస్తుంది. హారిక & హాసిని క్రియేషన్స్ ఎస్.రాధాకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ రెండు సంస్థలు కలిసి మూవీస్ నిర్మిస్తుంటాయి.
తాజాగా... హరీష్ శంకర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో విజయ్ దేవరకొండతో ఓ మూవీ చేస్తారనే ప్రచారం మాత్రమే సాగుతోంది. ఉస్తాద్ తర్వాతే సితార సంస్థకే హరీష్ శంకర్ ప్రాజెక్ట్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రేజీ కాంబోలో మూవీ వస్తే హిట్ ఖాయమంటూ ఫిలిం నగర్ వర్గాల నుంచి కామెంట్స్ వస్తున్నాయి.