Allu Arjun Shows Attitude In Mumbai Airport: సెలబ్రిటీలంటే ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారితో ఒక్క సెల్ఫీ అయినా దిగాలంటూ ఫ్యాన్స్ తాపత్రయపడుతుంటారు. 'పుష్ప' మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ అట్లీతో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కోసం గత నెలలో ముంబై వెళ్లిన బన్నీ... శనివారం అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేందుకు రెడీ అయ్యారు.


మాస్క్ తీయండి...


ఫ్యాన్స్ హడావుడి వాటిని తప్పించుకునేందుకు బన్నీ ముఖానికి మాస్క్, కళ్లజోడుతో ఎయిర్ పోర్టులో ఎంట్రీ ఇచ్చారు. బయట నుంచి కొందరు అన్నా, అన్నా అని పిలుస్తున్నా కేవలం చేయి ఊపుతూ ఎయిర్ పోర్టులోకి వెళ్లారు. అయితే, ఎయిర్ పోర్టు సెక్యూరిటీ దగ్గర సిబ్బంది ఆయన్ను గుర్తు పట్టలేదు. 'సార్... ఆయన అల్లు అర్జున్' అంటూ అసిస్టెంట్ సదరు సెక్యూరిటీ అధికారికి చెప్పారు. అయినా సరే ఫోటో ఐడీ చూస్తూ మాస్క్ తీయాలని పట్టుబట్టారు.


దీంతో కొద్దిసేపు ఆలోచించిన బన్నీ... సదరు అధికారితో మాట్లాడిన తర్వాత కళ్లజోడు, మాస్క్ తీసి ఫేస్ చూపించారు. ఆ తర్వాత బన్నీని లోపలికి అనుమతించారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా... నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


రూల్స్ పాటించాల్సిందే...


ఎవరైనా సరే ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది వద్ద రూల్స్ పాటించాల్సిందేనంటూ కొందరు బన్నీ తీరును తప్పుపడుతున్నారు. ఆయన ఆటిడ్యూడ్ చూపించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అయితే, కొందరు బన్నీ ఫ్యాన్స్ ఆయన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఎయిర్ పోర్టులో తోటి ప్రయాణికులు సెల్ఫీల కోసం వేధిస్తారని... అందుకే ఆయన మాస్క్ వేసుకున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయినా, మాస్క్ వేసుకుంటే ఎవరైనా ఎలా గుర్తు పడతారని... అందుకే సెక్యూరిటీ సిబ్బంది మాస్క్ తీయమన్నారంటూ పేర్కొంటున్నారు. ఆయనకు అవమానం జరిగిందంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా... ఇందులో పెద్ద చర్చించుకోవాల్సిందేమీ లేదని... బన్నీకి ఎలాంటి అవమానం జరగలేదని మరికొందరు అంటున్నారు.



Also Read: ఎన్టీఆర్‌తో హృతిక్ కూడా... వర్షం వచ్చినా 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగదు... పకడ్బందీ ఏర్పాట్లు చేసిన టీమ్ - ఇవిగో ఫుల్ డీటెయిల్స్


న్యూ లుక్


పుష్ప, 'పుష్ప 2' మూవీస్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బన్నీ. ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్‌లో స్టార్ డైరెక్టర్ అట్లీతో మూవీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ కాగా... శనివారం ముంబై ఎయిర్ పోర్టులో న్యూ లుక్‌లో అదరగొట్టారు బన్నీ. ఈ వీడియోను నెట్టింట షేర్ చేస్తున్న బన్నీ ఫ్యాన్స్ లుక్ అదిరిపోయిందని... అట్లీ మూవీ వేరే లెవల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ఈ మూవీలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 3 జనరేషన్స్‌లో నాలుగు కీలక రోల్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. తాత, తండ్రి, ఇద్దరు కుమారులుగా ఆయన సందడి చేయనున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. సమాంతర ప్రపంచం, పునర్జన్మ బ్యాక్ డ్రాప్‌‌గా సైన్స్ ఫిక్షనల్ హాలీవుడ్ రేంజ్ 'AA22' మూవీ తెరకెక్కుతోంది. బన్నీ సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్‌ను టీం అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయగా... మిగిలిన రోల్స్‌లో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక, భాగ్యశ్రీ బోర్సే పేర్లు వినిపిస్తున్నాయి.