War 2 Pre Release Event Full Details: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన ఫస్ట్ బాలీవుడ్ సినిమా 'వార్ 2'. ఆగస్టు 14న తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ రోజు (ఆగస్టు 10న) హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులు ఎవరు? ఎన్ని గంటలకు ఈవెంట్ మొదలు అవుతుంది? ఎక్కడ చేస్తున్నారు? ఎవరెవరు వస్తున్నారు? వంటి వివరాలు తెలుసుకోండి.
ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్ కూడా!'వార్ 2' ప్రొడ్యూస్ చేసిన యష్ రాజ్ ఫిల్మ్స్ పబ్లిసిటీ స్ట్రాటజీలో ఎన్టీఆర్ (NTR)కు తోడు హృతిక్ రోషన్ కలిసి పార్టిసిపేట్ చేసే ఈవెంట్స్ లేవు. ఆ విషయం ముందుగా అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్, హృతిక్ వేర్వేరుగా ప్రమోషన్ చేస్తారని! హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆ స్ట్రాటజీ పక్కన పెట్టారు. దీనికి హీరోలు ఇద్దరూ అటెండ్ అవుతున్నారు. రాజమౌళి లేదా త్రివిక్రమ్ హాజరు కావచ్చని టాక్. ఒకవేళ వాళ్ళు గనుక రాకపోతే ముఖ్య అతిథులు అంటూ ఎవరూ ఉండరు. ఎన్టీఆర్, హృతిక్ సెంటరాఫ్ అట్రాక్షన్ అవుతారు. అతిథులు వచ్చినా వాళ్లిద్దరే హైలైట్ అవుతారనుకోండి.
'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ? ఎప్పుడు?హైదరాబాద్ సిటీలో యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఈ రోజు (ఆగస్టు 10వ తేదీ) సాయంత్రం ఐదు గంటల నుంచి వేడుక మొదలు అవుతుంది. పాసులు ఉన్న అభిమానులు మాత్రమే వెళ్లడం మంచిది. గతంలో తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ఈవెంట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వర్షం వస్తే పరిస్థితి ఏంటి? అప్పుడేం చేస్తారు?హైదరాబాద్ నగరంలో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఒకవేళ ఈవెంట్ సమయంలో వర్షం వస్తే? పోలీస్ గ్రౌండ్స్ అంటే అవుట్ డోర్ కదా? వంటి ప్రశ్నలు, సందేహాలు అవసరం లేదు. పకడ్బందీగా 'వార్ 2' టీం ఏర్పాట్లు చేసింది. వర్షం కురిసినా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టేజి మీద రూఫ్ టాప్ ఏర్పాటు చేసింది. అంతే కాదు... స్టేజి ముందు కూడా కొంత వరకు రెయిన్ ప్రూఫ్ టెంట్స్ వేసింది. అభిమానులకు సైతం ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని మ్యాగ్జిమమ్ ట్రై చేస్తున్నారు.
Also Read: 'బాహుబలి ది ఎపిక్' టీజర్ రెడీ... పంద్రాగస్టుకు ఆ రెండు సినిమాలతో పాటు థియేటర్లలోకి!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'వార్ 2' సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేయనున్నారు.