యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ డిఫరెంట్ ఫిలిమ్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత మల్టీస్టారర్ ఫిల్మ్ 'భైరవం'తో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
సెప్టెంబర్ 12న థియేటర్లలోకి 'కిష్కిందపురి'Kishkindhapuri Release Date: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా రూపొందుతున్న హారర్ మిస్టరీ థ్రిల్లర్ 'కిష్కిందపురి'. సూపర్ హిట్ 'రాక్షసుడు' తర్వాత మరోసారి ఆయన సరసన అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
Kishkindhapuri Movie Director: 'కిష్కిందపురి' చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకం మీద సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. 'చావు కబురు చల్లగా' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త పోస్టర్ విడుదల చేశారుఆయన ఇంటెన్స్ లుక్ సినిమాపై సస్పెన్స్ మరింత పెంచింది. వింటేజ్ రేడియో ఒకటి విరిగి ఎగిరిపోతూ ఉంటే... బ్యాక్ గ్రౌండ్‌లో టెర్రిఫిక్ మాన్షన్ మంటల్లో కాలిపోవడం... అందులో థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఉంది. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై ఓ ఇమేజ్ క్రియేట్ చేయగా... ఫస్ట్ సాంగ్ 'ఉండిపోవే నాతోనే' మాత్రం కథలో టెన్షన్‌తో పాటు రొమాంటిక్ షేడ్ ప్రజెంట్ చేసింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.
Also Read: వడ్డే నవీన్ ఈజ్ బ్యాక్... 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు'తో రీ ఎంట్రీ - ఫస్ట్ లుక్ రిలీజ్
'కిష్కిందపురి'లో దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి ఓ డార్క్, మిస్టీరియస్ ప్రపంచాన్ని చూపించనున్నారని, ఉత్కంఠతో పాటు కథలో ఎమోషనల్ మూమెంట్స్ చక్కగా మిక్స్ చేశారని, కథ ముందుకు సాగే కొలదీ థ్రిల్ల్స్, ఎమోషన్స్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయని చెప్పారు.
Also Read: మహేష్ బాబు పర్సనల్ లైఫ్ గురించి గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రశ్నలు... సమాధానాలు తెల్సా?
Kishkindhapuri Movie Cast And Crew: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: మనీషా ఎ దత్, కళా దర్శకుడు: డి శివ కామేష్, కూర్పు: నిరంజన్ దేవరమానే, సహ రచయిత: దరహాస్ పాలకొల్లు, స్క్రిప్ట్ అసోసియేట్: కె బాల గణేష్, స్టంట్స్: రామ్ క్రిషన్ - నటరాజ్ - జాషువా, కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి, ఛాయాగ్రహణం: చిన్మయ్ సలాస్కర్,సంగీతం: సామ్ సిఎస్, సమర్పణ: శ్రీమతి అర్చన, నిర్మాణ సంస్థ: షైన్ స్క్రీన్స్, నిర్మాత: సాహు గారపాటి, రచన & దర్శకత్వం: కౌశిక్ పెగల్లపాటి.