'పెళ్లి', 'మానసిచ్చి చూడు', 'చాలా బాగుంది' వంటి విజయవంతమైన సినిమాల్లో నటించిన హీరో వడ్డే నవీన్ (Vadde Naveen). కొన్నాళ్లుగా సినిమాలకు ఆయన దూరంగా ఉన్నారు. ఇప్పుడు హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. స్వీయ నిర్మాణంలో 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' అంటూ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇవాళ ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు
'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు'తో...హీరో, నిర్మాత, రచయితగా వడ్డే నవీన్!'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు'లో హీరోగా నటించడం, సినిమాను నిర్మించడంతో పాటు కథా రచనలోనూ దర్శకుడితో కలిసి వడ్డే నవీన్ పాలు పంచుకుంటున్నారు. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కమల్ తేజ నార్ల దర్శకత్వం వహిస్తున్నారు. రాసి సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్న వడ్డే నవీన్... పోలీసుగా సందడి చేయనున్నారు.
Also Read: మహేష్ బాబు పర్సనల్ లైఫ్ గురించి గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రశ్నలు... సమాధానాలు తెల్సా?
తెలుగు చిత్రసీమలో వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ ప్రముఖ నిర్మాత. విజయ మాధవి కంబైన్స్ సంస్థలో ఎన్టీఆర్ 'బొబ్బిలి పులి', చిరంజీవి 'లంకేశ్వరుడు', కృష్ణం రాజు 'కటకటాల రుద్రయ్య' వంటి పలు హిట్ సినిమాలు ప్రొడ్యూస్ చేసింది. తండ్రి బాటలో నడుస్తూ వడ్డే క్రియేషన్స్ నిర్మాణ సంస్థను స్థాపించారు నవీన్. ఈ బ్యానర్ మీద వరుస సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమవుతున్నారు. నిర్మాతగా తన తొలి ప్రయత్నంలో 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు'ను ప్రారంభించారు. ఈ ఏడాది మే 15న చిత్రికరణ ప్రారంభించామని, ఇప్పటి వరకు దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తి చేశామని తెలిపారు.
Also Read: రియల్ హీరో... లిటిల్ హార్ట్స్ సేవియర్ మహేష్ బాబు - సూపర్ స్టార్ ఫౌండేషన్ నుంచి సాయం ఇలా పొందొచ్చు!
Transfer Trimurthulu Movie Cast And Crew: వడ్డే నవీన్, రాశీ సింగ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' సినిమాలో రఘు బాబు, సాయి శ్రీనివాస్, బాబా మాస్టర్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, దేవీ ప్రసాద్, సూర్య కుమార్ భగవదాస్, శివ నారాయణ, ప్రమోదిని, గాయత్రి భార్గవి, జ్వాల కోటి, దేవి మహేష్, ఊహా రెడ్డి, రేఖా నిరోష, గాయత్రి చాగంటి, సాత్విక్ రాజు, అంజలి ప్రియ తదితరులుప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కథ - కథనం: కమల్ తేజ నార్ల - వడ్డే నవీన్, కూర్పు: విజయ్ ముక్తావరపు, ఛాయాగ్రహణం: కార్తీక్ సుజాత సాయికుమార్, సంగీత దర్శకుడు : కళ్యాణ్ నాయక్, నిర్మాణ సంస్థ: వడ్డే క్రియేషన్స్, సమర్పణ : వడ్డే జిష్ణు, నిర్మాత: వడ్డే నవీన్, దర్శకుడు : కమల్ తేజ నార్ల.