Soham Majumdar's Bibhishon OTT Streaming On Zee5: క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ సైకో థ్రిల్లర్స్ అంటే ఇంట్రెస్ట్ వేరే లెవల్‌లో ఉంటుంది. గ్రామంలో వరుసగా దారుణ హత్యలు. సైకోని పట్టుకునేందుకు పోలీసుల వేట ప్రధానాంశంగా సాగే ఓ వెబ్ సిరీస్ ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. దాని పేరే 'బిబీషణ్'. ఈ సిరీస్ తెలుగు సబ్ టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.

Continues below advertisement


ఎందులో చూడొచ్చంటే?


ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ 'జీ5'లో స్ట్రీమింగ్ అవుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్స్, క్రైమ్ డ్రామా ఇష్టపడే వారికి ఈ సిరీస్ కచ్చితంగా మంచి థ్రిల్ పంచుతుంది. సోహమ్ మజుందార్, దేవ్ చంద్రిమ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించగా... రాజాచంద్ర దర్శకత్వం వహించారు. ప్రమీత్ ఎ.ఘోష్ స్టోరీ అందించారు. ఐఎండీబీలో ఈ సిరీస్‌ 7.1 రేటింగ్‌తో దూసుకెళ్తోంది.


Also Read: రామ్ చరణ్ 'పెద్ది' స్పెషల్ సాంగ్‌లో సమంత? - వైరల్ న్యూస్‌లో నిజమెంత?


స్టోరీ ఏంటంటే?


బెంగాల్‌లోని బలగఢ్ అనే చిన్న పల్లెటూరి ప్రశాంతతకు మారుపేరు. పెద్దగా ఎలాంటి నేరాలు కూడా ఉండవు. దీంతో పోలీసులు తమ పని తాము చూసుకుంటూ ఉంటారు. అయితే, ఒక రోజు చిన్న దొంగతనం కేసు, ఓ వ్యక్తి అదృశ్యంపై కేసు ఫైల్ అవుతాయి. వీటిని విచారించే గ్రామంలో ఓ తల లేని మొండెం కనిపిస్తుంది. దీంతో పోలీసులు షాక్ అవుతారు. గ్రామస్థులు కూడా భయాందోళనతో ఉంటారు. అదే రీతిలో వరుసగా తలలు లేకుండానే మర్డర్స్ జరుగుతుంటాయి. పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారుతుంది.


ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు పలు ఆధారాలతో నిందితున్ని పట్టుకుంటారు. అయితే, అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పటివరకూ ఊళ్లో తన పనేదో తాను చేసుకుంటూ అమాయకంగా కనిపించే వ్యక్తే ఈ హత్యలు చేస్తుండడం చూసి పోలీసులు ఆశ్చర్యపోతారు. అసలు అతను సైకోగా ఎలా మారాడు? ఎందుకు ఇలా ప్రశాంతమైన గ్రామంలో వరుసగా హత్యలు చేస్తున్నాడు? ఆ సైకో కిల్లర్‌ను పోలీసులు ఎలా పట్టుకున్నారు? అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. చివర్లో వచ్చే ట్విస్ట్ సిరీస్‌కే హైలెట్. మొత్తం 7 ఎపిసోడ్స్ ఉండగా ఆద్యంతం థ్రిల్ పంచే ఈ సిరీస్‌ను మీరూ చూసి ఎంజాయ్ చెయ్యండి.