Ram Pothineni About Paradha Movie: అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'పరదా'. ఆమెతో పాటు సంగీత, దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు. సినిమా బండి ఫేం ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా యంగ్ హీరో రామ్ పోతినేని మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీని ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ నిర్మిస్తున్నారు.

అనుపమలో కొత్త కోణం

'పరదా' మూవీ చాలా అద్భుతమైన కథ అని... ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఎంకరేజ్ చేయాలంటూ రామ్ తెలిపారు. 'బాలీవుడ్‌లో లాపత లేడీస్ వంటి సినిమాలు చూస్తుంటాం. ఇలాంటి సినిమాలు విజయాలు సాధిస్తే నిర్మాతలకి ధైర్యం వస్తుంది. ప్రవీణ్ తీసిన సినిమా బండి సినిమా నాకు చాలా ఇష్టం. ఈ మూవీతో అతను మరో అద్భుత విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అనుపమ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఏ క్యారెక్టర్ ఇచ్చినా 100 శాతం ఎఫర్ట్ పెడుతుంది. తనకి సినిమా అంటే చాలా ఫ్యాషన్. ఈ సినిమాలో ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఆగస్టు 22న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మిస్ అవ్వకుండా చూడండి' అని అన్నారు.

అది నా అదృష్టం

రామ్ లాంటి మంచి ఫ్రెండ్ ఉండడం తన అదృష్టమని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. 'పరదా సినిమా నాకు ఎంత ఇంపార్టెంటో ఆయనకు తెలుసు. రామ్ బిజీ షెడ్యూల్‌లో మా కోసం వచ్చి ఈ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఆంధ్ర కింగ్ తాలూక కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఆగస్టు 22న రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నా.' అని చెప్పారు.

Also Read: సార్... ఈయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్! - అయినా సరే మాస్క్ తీసి చూపించండి

బిగ్ స్కేల్ మూవీ

యంగ్ హీరో రామ్ తమకు మంచి సపోర్ట్ ఇచ్చారని... ట్రైలర్ లాంచ్ చేసిన ఆయనకు థాంక్స్ చెప్పారు డైరెక్టర్ ప్రవీణ్. 'ప్రాణం పెట్టి సినిమా చేశాం. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. నా సినిమాలు శుభం, సినిమా బండి ఒక జోనర్ సినిమాలు. ఇది మాత్రం ఒక బిగ్ స్కేల్ మూవీ. ముగ్గురు పెద్ద స్టార్స్‌తో మూవీ చేశాను. ఇది ప్రాపర్ కమర్షియల్ సినిమా. ఈ సినిమాతో అనుపమ కొత్త వెర్షన్ చూడబోతున్నారు. ఈ సినిమా రివ్యూ బాగుంటేనే సినిమా చూడండి.' అని అన్నారు.

ఈ సినిమాతో అనుపమ 2.Oను చూడబోతున్నామని... మంచి సినిమాను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ తెలిపారు. తమ సినిమాను ప్రమోట్ చేసేందుకు వచ్చిన రామ్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

ట్రైలర్ అదుర్స్

‘పరదా’ కథ సుబ్బు (అనుపమ పరమేశ్వరన్) చుట్టూ తిరుగుతుంది. తన ఊరిలోని కఠినమైన, మగవారికి మాత్రమే సపోర్ట్‌గా ఉండే సంప్రదాయాల వల్ల విసిగిపోయిన ఆమె... ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఇద్దరు అపరిచితులు (దర్శన రాజేంద్రన్, సంగీత)తో కలసి, ఓ ఎనర్జీతో నిండిన రోడ్ ట్రిప్‌కి వెళ్తుంది. కానీ, ఆ టైంలో సుబ్బు అదృశ్యమవుతుంది. ఊరిలో ఆమె కోసం ఓ ప్రమాదం పొంచి ఉంటుంది. అసలు ఆ ప్రమాదం ఏంటి? ఊరిలో అంతా ఎందుకు ఆమెకు వ్యతిరేకమవుతారు? అసలు పరదా వెనుక స్టోరీ ఏంటో తెలియాలంటే మూవీ చూడాల్సిందే.