Shankar On Game Changer Movie: దర్శకుడు శంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం 'భారతీయుడు 2' (తమిళంలో 'ఇండియన్ 2') జూలై 12న తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం (జూలై 7న) హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ వేడుకలో 'గేమ్ ఛేంజర్' సినిమా అప్డేట్ ఇచ్చారు శంకర్.


చరణ్ నటనకు శంకర్ ఫిదా... ప్రశంసలు!
తనను, తన సినిమాలను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న తెలుగు ప్రేక్షకుల కోసం ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలని ఉందని ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నానని, తనకు ఆ అవకాశం 'గేమ్ ఛేంజర్'తో లభించిందని దర్శకుడు శంకర్ తెలిపారు. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపించారు.






'గేమ్ ఛేంజర్' సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయ్యిందని శంకర్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''రామ్ చరణ్ గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ స్క్రీన్ ప్రజెన్స్. ఆయన దగ్గర ఒక కంట్రోల్డ్ పవర్ ఉంటుంది. ఎప్పుడు బ్లాస్ట్ అయిపోతుందా? అని పవర్ ఉన్న మంచి యాక్టర్. 'గేమ్ ఛేంజర్' సినిమా చూస్తే అది మీకు అర్థం అవుతుంది. రామ్ చరణ్ తో సినిమా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకో పది, పదిహేను రోజులు షూటింగ్ చేయాల్సి ఉంది. అది పూర్తి అయ్యాక ఫస్ట్ కాపీ రెడీ చేసి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాం'' అని చెప్పారు.


Also Read: పవన్‌ కళ్యాణ్‌ను ఏపీ సీఎం చేయాలి - భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో ఎస్‌జే సూర్య



కమల్ తరహాలో నటించేవారు ప్రపంచంలో లేరు!
'భారతీయుడు 2' / 'ఇండియన్ 2' సినిమా గురించి శంకర్ మాట్లాడుతూ... ''పత్రికలు, టీవీల్లో లంచం తీసుకుంటున్నారని చూసినప్పుడల్లా నాకు సేనాపతి గుర్తుకు వస్తాడు. అయితే... ఇన్నాళ్లూ కథ కుదరలేదు. '2.ఓ' తర్వాత కథ వచ్చింది. కమల్ హాసన్ గారికి చెప్పా. ఆయనకూ నచ్చింది. 'భారతీయుడు 2' సెట్‌లోకి సేనాపతిగా ఆయన్ను చూశాక నాకు గూస్‌ బంప్స్ వచ్చాయి. ప్రేక్షకులకూ అదే అనుభూతి కలుగుతుంది. ఆయన నటన వల్ల నేను రాసిన సన్నివేశంలో ఇంపాక్ట్ పదింతలు పెరుగుతుంది. అటువంటి నటులు దొరకడం అదృష్టం. రోప్‌ మీద ప్రోస్థటిక్ మేకప్‌ వేసుకుని నాలుగు రోజులు షూట్ చేశారు. ఆయనలా నటించే వారు ఈ ప్రపంచంలోనే లేరు. 'బాయ్స్'తో సిద్దార్థ్‌ను హీరోగా పరిచయం చేసింది నేనే. మళ్లీ అతనితో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. అతను అద్భుతంగా నటించాడు. రకుల్, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సముద్రఖని... అందరూ బాగా నటించారు. నేను బ్రహ్మానందం గారి అభిమాని. 'భారతీయుడు 2'లో ఆయన చేత ఓ అతిథి పాత్ర చేయించా. నేను అడగ్గానే ఆయన నటించారు. 'గేమ్ చేంజర్‌' సినిమాలోనూ ఓ అతిథి పాత్రలో కనిపిస్తారు'' అని చెప్పారు.


Also Read: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!