గత కొన్నిరోజుల్లో తెలుగు సినీ పరిశ్రమ నుండి ఎంతోమంది గ్లోబల్ స్టార్స్ పుట్టుకొచ్చారు. వారు నటిస్తున్న తెలుగు సినిమాలు ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుదల అవ్వడంతో పాటు అవన్నీ బ్లాక్‌బస్టర్ సాధించడంతో చాలామంది హీరోలకు ప్యాన్ ఇండియా స్టార్స్ అనే ట్యాగ్ వచ్చింది. అందులో ఒకరు రామ్ చరణ్. మెగా పవర్ స్టార్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయాడు. మొదట్లో రామ్ చరణ్ అంటే కేవలం మెగాస్టార్ చిరంజీవి తనయుడిగానే ప్రేక్షకులకు తెలిసినా.. మెల్లగా తన టాలెంట్‌తో అందరినీ మెప్పించగలిగాడు. తాజాగా రామ్ చరణ్.. హీరోగా పరిచయమయ్యి 16 ఏళ్లు అవుతుండగా.. తన భార్య ఉపాసన.. ఒక స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేశారు.


‘చిరుత’ ఒక ల్యాండ్‌మార్క్..
2007 సెప్టెంబర్ 28న పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘చిరుత’ అనే చిత్రంతో హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు రామ్ చరణ్. మొదటి సినిమానే కమర్షియల్ జోనర్‌ను ఎంచుకొని.. అప్పటినుండే మాస్ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పూరీ జగన్నాధ్‌కు కమర్షియల్ సినిమాలు తెరకెక్కించడంలో సక్సెస్ రేటు ఉంది. అందుకే తన మీద నమ్మకంతో తన తనయుడి డెబ్యూ బాధ్యతను పూరీకి అందించాడు చిరు. పూరీ కూడా చిరు నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’కు ముందు రామ్ చరణ్.. బెస్ట్ ఎంట్రీ సీన్ అంటే ఫ్యాన్స్.. ‘చిరుత’ అనే చెప్పుకునేవారు. ‘చిరుత’ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించిన రామ్ చరణ్.. ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.


16 ఏళ్లు పూర్తి..
రామ్ చరణ్ కెరీర్‌లో ఘోరమైన డిసాస్టర్లు చాలా తక్కువ. యావరేజ్‌గా, క్లీన్ హిట్‌గా నిలిచిన సినిమాలే ఎక్కువ. ఒక ట్రాక్‌లో తన కెరీర్‌ను మెయింటేయిన్ చేస్తున్న రామ్ చరణ్‌కు ‘మగధీర’తో సెన్సేషనల్ హిట్ అందించాడు రాజమౌళి. ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ హిట్‌ను అందించాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ అంతా తనను గుర్తుపట్టేలా చేసుకున్నాడు. తన కెరీర్ ఫార్మ్‌లో ఉన్న సమయంలోనే ఉపాసనను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ పర్ఫెక్ట్ కపుల్ అని ఇప్పటికీ ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. తాజాగా ఉపాసన.. రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి వచ్చి 16 ఏళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో స్పెషల్‌గా విష్ చేయడం చూసి మరోసారి వీరిద్దరు పర్ఫెక్ట్ కపుల్ అని ఫ్యాన్స్ అనుకోవడం మొదలుపెట్టారు.


ఎప్పుడూ సపోర్ట్‌గా..
‘స్వీట్ 16, రామ్ చరణ్‌కు 16 ఏళ్లు’ అంటూ క్యాప్షన్‌తో ఒక స్పెషల్ ఫోటోను షేర్ చేసింది ఉపాసన. 2012 జూన్ 14న రామ్ చరణ్, ఉపాసనల వివాహం జరగగా.. అప్పటినుండి మెగా ఫ్యాన్స్ అందరూ ఉపాసనను వదిన అని పిలవడం మొదలుపెట్టారు. ఎన్నో సందర్భాల్లో రామ్ చరణ్‌కు సపోర్ట్‌గా ఉపాసన నిలబడడం చూసి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అయ్యేవారు. ఇక తన కెరీర్ విషయంలో కూడా చరణ్‌కు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటుంది ఉపాసన. ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇందులో రెండోసారు తను కియారాతో జతకడుతున్నాడు.


Also Read: 'ఆర్.ఆర్.ఆర్, 'పుష్ప' సినిమాల్లో ఏముందని చూడటానికి? బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా షాకింగ్ కామెంట్స్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial