Rakul Preet Singh Wedding Date: గత రెండేళ్లలో ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కారు. ఇక ఈ ఏడాది కూడా ఒక బాలీవుడ్ సెలబ్రిటీ ప్రేమజంట.. పెళ్లితో ఒక్కటవ్వనున్నారని రూమర్స్ వైరల్ అయ్యాయి. టాలీవుడ్‌తో హీరోయిన్‌గా స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్న రకుల్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో సెటిల్ అయిపోయింది. తన ఫుల్ ఫోకస్ హిందీ సినిమాపైనే ఉంది. ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే కాదు.. తన పర్సనల్ లైఫ్ కూడా అక్కడే ఉందని రకుల్ ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే తను ప్రేమించిన వ్యక్తి కూడా ఒక బాలీవుడ్ సెలబ్రిటీ కాబట్టి. ఇక రకుల్.. తన బాయ్‌ఫ్రెండ్ జాకీ భగ్నానీని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యిందని బీ టౌన్‌లో రూమర్స్ వైరల్ అవుతున్నాయి.


ఆఫ్ స్క్రీన్ ప్రేమకథ..
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ కలిసి స్క్రీన్‌పై నటించకపోయినా.. ఆఫ్ స్క్రీన్ మాత్రం వీరి మనసులు కలిశాయి. రెండేళ్ల క్రితం వీరి ప్రేమ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది ఈ జంట. అప్పటినుండి పలుమార్లు వీరి పెళ్లి జరగనుందని రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈసారి కూడా త్వరలోనే వీరి పెళ్లి అని బీ టౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈసారి వార్తల్లో నిజముందని సినీ వర్గాలు చెప్తున్నాయి. 2024లో రకుల్, జాకీ పెళ్లి పీటలెక్కాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ఎక్కువ ఆలస్యం చేయకుండా ఫిబ్రవరీలోనే పెళ్లిని ఫిక్స్ చేసేశారట.






ప్రస్తుతం బ్యాచిలర్ పార్టీలో..
గోవాలో రకుల్, జాకీ భగ్నానీల డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఫిబ్రవరీ 22న గోవాలో వీరి పెళ్లి కోసం ఏర్పాటు మొదలయ్యాయని బాలీవుడ్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏర్పాట్ల విషయం బయటికి రాకుండా జాగ్రత్తపడుతున్నారని సమాచారం. ఇతర బాలీవుడ్ సెలబ్రిటీలలాగానే వీరు కూడా కేవలం ఫ్యామిలీ, కొందరు ఫ్రెండ్స్‌ సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. పెళ్లి చాలా ప్రైవేట్ వేడుకలాగా జరగాలని రకుల్, జాకీ అనుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం వీరి బ్యాచిలర్ పార్టీలను ఎంజాయ్ చేయడానికి రకుల్, జాకీ థాయ్‌ల్యాండ్‌కు ప్రయాణమయినట్టు తెలుస్తోంది. ఇక వీరిద్దరి షూటింగ్స్‌కు కొంతకాలం బ్రేక్ పడినట్టే అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.


బాలీవుడ్‌లో సెటిల్..
తెలుగులో స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్న రకుల్.. టాలీవుడ్ వైపు తిరిగి చూసి చాలాకాలమే అయ్యింది. తనకు వరుసగా బాలీవుడ్‌లోనే ఆఫర్లు వస్తుండడంతో అక్కడే సెటిల్ అయిపోయింది. హిందీలో రకుల్ నటించిన సినిమాలు హిట్ అయినా.. ఫ్లాప్ అయినా పట్టించుకోకుండా తనకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక హిందీ సినిమాతో పాటు ఒక తమిళ చిత్రం కూడా ఉంది. శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఇండియన్ 2’లో ఈ భామ ఒక కీలక పాత్రలో కనిపించనుంది. అంతే కాకుండా శివకార్తికేయన్ సరసన తను నటించిన ‘అయాలన్’ కూడా విడుదలకు సిద్ధమయ్యింది. వీటితో పాటు ‘మేరీ పత్నీ కా’ హిందీ రీమేక్‌లో కూడా రకుల్ హీరోయిన్‌గా నటిస్తోంది.


Also Read: ఆ ఓటీటీలో 'హనుమాన్' - థియేటర్లలో విడుదలైన ఎన్ని వారాలకు స్ట్రీమింగ్ అవుతుందంటే?