Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!

Amitabh Bachchan In Rajinikanth's 170th Movie : సూపర్ స్టార్ రజనీకాంత్, బిగ్ బి అమితాబ్ స్నేహితులు. గతంలో కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. మళ్ళీ 32 ఏళ్ళ తర్వాత కలిసి చేస్తున్నారు.  

Continues below advertisement

Amitabh Bachchan Rajinikanth Movie : రజనీకాంత్, అమితాబ్ బచ్చన్... ఇద్దరూ లెజెండ్స్! ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని చెప్పడానికి లేదు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇద్దరికీ సముచిత స్థానం ఉంది. రజనీకాంత్ తమిళ సినిమాలు ఎక్కువ చేశారు. మధ్య మధ్యలో తెలుగు, హిందీ సినిమాల్లో కనిపించారు. అయితే... ఆయనకు దేశమంతా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు మిగతా భాషల్లో అనువాదం అవుతూ ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ హిందీ సినిమాలు ఎక్కువ చేసినా ఆయనకూ నేషనల్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారని కోలీవుడ్ టాక్. 

Continues below advertisement

తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్! 
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మధ్య మంచి స్నేహం ఉంది. కెరీర్ తొలినాళ్లలో ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు ఉన్నాయి. 'అంధా కానూన్', 'గేరేఫ్తార్', 'హమ్'లో ఇద్దరు లెజెండ్స్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మళ్ళీ 32 ఏళ్ళ తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని చెన్నై ఖబర్. 

నయనతార 'కోలమావు కోకిల', శివ కార్తికేయన్ 'డాక్టర్', విజయ్ 'మాస్టర్' తర్వాత దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న సినిమా 'జైలర్' (Jailer Movie). ఇందులో హీరో ఎవరో తెలుసుగా? సూపర్ స్టార్ రజనీ! ఇటీవల చిత్రీకరణ పూర్తి చేశారు. కుమార్తె ఐశ్వర్యా ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లాల్ సలాం'లో కూడా రజనీకాంత్ నటిస్తున్నారు. అయితే, అందులో ఆయనది అతిథి పాత్రే. ఆ సినిమా తర్వాత సూర్య కథానాయకుడిగా 'జై భీమ్' వంటి క్లాసిక్ తీసిన టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అందులో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర చేస్తారని తెలిసింది.      

లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో...
Thalaivar 170 చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ రిటైర్డ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఎన్కౌంటర్ విధానం లేదా వ్యవస్థ మీద పోరాటం చేసే వ్యక్తిగా ఆయన పాత్ర ఉంటుందట. జూలై నెలాఖరు నుంచి చిత్రీకరణ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తారట.

Also Read : శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?

రజనీతో లైకా ప్రొడక్షన్స్ సంస్థకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆయనతో ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన '2.0' రికార్డులు క్రియేట్ చేసింది. 'దర్బార్' సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ, అందులో రజనీకాంత్ లుక్కు, యాక్షన్ సన్నివేశాలకు మంచి పేరు వచ్చింది. 'లాల్ సలాం'ను కూడా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. చూస్తుంటే... రజనీతో మరిన్ని సినిమాలు చేసేలా ఉన్నారు.

Also Read : బాలకృష్ణతో త్రివిక్రమ్ సందడి - ఎన్‌బికె 109 ఓపెనింగ్‌లో బర్త్‌డే సెలబ్రేషన్


 
క్రికెట్ & గొడవల నేపథ్యంలో 'లాల్ సలాం'
క్రికెట్ నేపథ్యంలో 'లాల్ సలాం' రూపొందుతోంది. అయితే... సినిమాలో క్రికెట్ ఒక్కటే కాదు, ఘర్షణలు సైతం ఉంటాయి. ఇందులో రజనీకాంత్ లుక్ కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఆయన ముస్లిం రోల్ చేస్తున్నారు. మొయిదీన్ భాయ్ గెటప్ సూపర్ స్టార్ అభిమానులను ఆకట్టుకుంది. అతిథి పాత్ర అయినప్పటికీ... తండ్రిని కుమార్తె ఎలా ప్రజెంట్ చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు రజని ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నారు.

Continues below advertisement
Sponsored Links by Taboola