ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కుటుంబంలో అందరూ క్రియేటివ్ పర్సన్సే. ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా 24 శాఖల్లో ఏదో ఒక శాఖలో పని చేస్తున్న వారే. అయితే... ఆ ఫ్యామిలీలో హీరో మాత్రం ఒక్కరే ఉన్నారు. అదీ శ్రీ సింహ కోడూరి. రాజమౌళి - కీరవాణి ఫ్యామిలీలో ఎందరో కెమెరా వెనుక ఉంటే, అతనొక్కడూ కెమెరా ముందుకు వచ్చారు. ఇప్పుడు అతని కోసం రాజమౌళి దిగొచ్చారు. ప్రచారంలో తనవంతు బాధ్యతగా ఓ చెయ్యి వేశారు. 


'బాహుబలి 2' కోసం ఊరూరూ ఎందుకు తిరిగారు?
శ్రీ సింహ కోడూరి (Sri Simha Koduri) కథానాయకుడిగా పరిచయమైన సినిమా 'మత్తు వదలరా'. బాక్సాఫీస్ బరిలో మంచి వసూళ్లు రాబట్టడమే కాదు... ఆ సినిమా విమర్శకులను సైతం మెప్పించింది. ఆ తర్వాత హీరోగా నాలుగు సినిమాలు చేశారు సింహ. అయితే... 'మత్తు వదలరా' అంత స్థాయిలో పేరు తెచ్చుకున్నవి తక్కువ. ఇప్పుడు విజయం కోసం 'మత్తు వదలరా 2' చేశారు. 


'మత్తు వదలరా'కు దర్శకత్వం వహించిన రితేష్ రాణా, ఇప్పుడీ 'మత్తు వదలరా 2' చిత్రాన్నీ తెరకెక్కించారు. ఇందులో శ్రీ సింహ కోడూరితో పాటు మొదటి భాగంలో విపరీతమైన వినోదం పంచిన సత్య కూడా సందడి చేయనున్నారు. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే... ఆ సౌండ్ చాలదని శ్రీ సింహ కోడూరి, ఆయన సోదరుడు - సంగీత దర్శకుడు కాల భైరవ భావించారు. అందుకోసం రాజమౌళిని సైతం రంగంలోకి దించారు. 


'సింహా... మిక్సింగ్ అయిపొయింది. అవుట్ పుట్స్ అన్నీ ఇచ్చేశాం. కానీ, రిలీజుకు ఎంతో టైమ్ లేదు. ఏదో గట్టిగా సౌండ్ చేయాలి' అని కాలభైరవ చెబుతాడు. ఆ వెంటనే 'ఏం చేద్దాం చెప్పు' అని అడుగుతాడు. అప్పుడు 'మనం సౌండ్ చేయాల్సింది ఇక్కడ కాదు... చెబుతా పదా' అని రాజమౌళి దగ్గరకు తీసుకు వెళతాడు సింహ. రూమ్ బయట గట్టిగా అన్నదమ్ములు ఇద్దరూ మాట్లాడుతుంటే రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ బయటకు వస్తాడు.


Also Readమలైకా ఆరోరా ఇంట విషాదం... బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహ్యత చేసుకున్న తండ్రి



'ఏంట్రా గోల... లోపల ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. డిస్టర్బ్ అవుతారు' అని కార్తికేయ అంటే... 'మాకు రిలీజ్ టెన్షన్స్ ఉన్నాయి. ప్రమోషన్స్ గట్టిగా చేయాలి కదా!' అని సింహ సమాధానం ఇచ్చాడు. 'ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంటే అప్పుడే రిలీజ్ ఏంట్రా?' అన్నారు కార్తికేయ. 'మేం మాట్లాడేది మత్తు వదలరా 2 గురించి. అప్పుడప్పుడూ మా గురించి ఆలోచించు' అని కాలభైరవ అన్నాడు. కాసేపు డిస్కషన్ జరిగాకా... ''మత్తు వదలరా 2'కు ప్రమోషన్ ఎందుకురా? సీక్వెల్ అని చెప్పు. జనాలు వచ్చేస్తారు'' అని కార్తికేయ సలహా ఇచ్చారు. అప్పుడు సింహ ''చా... మరి మీరు 'బాహుబలి 2' కోసం అన్ని ఊర్లు ఎందుకు తిరిగారు. అంత ప్రమోషన్ ఎందుకు చేశారు?'' అన్నాడు. 'కరెక్టుగా అడిగావు'' అని కాలభైరవ సపోర్ట్ చేశాడు. 






రాజమౌళిని డిమాండ్ చేసి మరీ...
చివరకు రాజమౌళి బయటకు వచ్చారు. 'ఏంట్రా గోల? పని చేసుకోనివ్వరా' అని అడిగారు. 'చేసుకోవచ్చు బాబా... ముందు మా పని కావాలి' అని చెప్పారు కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ. 'ఏంటి ఆ పని' అని రాజమౌళి అడిగితే... 'మా సినిమా గట్టిగా సౌండ్ చేయాలి' అని సింహ చెప్పాడు. 'చేయకపోతే?' అని రాజమౌళి ప్రశ్నించగా... 'మేం ఇక్కడ సౌండ్ ఆపం' అని స్పష్టం చేశాడు సింహ. 'డిమాండ్ ఎక్కువ అయ్యింది' అంటూ సెప్టెంబర్ 13న 'మత్తు వదలరా 2' చూడామని చెప్పారు రాజమౌళి. క్రియేటివిటీతో రూపొందించిన ఈ వీడియో, రాజమౌళి మాట అబ్బాయిల సినిమాకు కావాల్సినంత ప్రచారం తీసుకొచ్చింది.


Also Readకొరటాల పక్కన సరైన వ్యక్తులు ఉంటే బ్లాక్ బస్టర్స్ ఇస్తాడు - మెగా ఫ్యాన్స్‌కు మంట పెట్టేలా ఎన్టీఆర్ మాటలు