రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు ఇవాళ పండగ రోజు. 'సలార్', 'కల్కి 2898 ఏడీ' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చాయి. అయితే ఆ రెండు యాక్షన్ ఫిలిమ్స్. ఇప్పుడు వింటేజ్ ప్రభాస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని దర్శకుడు మారుతి చాలా బలంగా చెబుతున్నారు. 'ది రాజా సాబ్' నుంచి ఇప్పటి వరకు విడుదలైన స్టిల్స్ చూస్తే అభిమానుల్లో కూడా నమ్మకం బలపడింది. ఇవాళ సినిమా టీజర్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. దానికి ముందు, వెనుక మరిన్ని ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు 'ది రాజా సాబ్' టీమ్. ఆ షెడ్యూల్ తెలుసుకోండి. 

ఉదయం ప్రసాద్స్ దగ్గర కటౌట్ లాంచ్!హైదరాబాద్ అంటే సినిమా ప్రేమికులు అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ప్రసాద్ మల్టీప్లెక్స్. ఒకప్పుడు అందులో ఐమాక్స్ స్క్రీన్ ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో లార్జ్ స్క్రీన్ ఒకటి వచ్చింది. అయితే ఆడియన్స్ అందరికీ ఐమాక్స్ అనడం అలవాటు అయింది. హైదరాబాద్ సిటీలో జనాలకు ఉదయం ఎనిమిది గంటలకు ఐమాక్స్ స్క్రీన్ లలో రిలీజ్ రోజు సినిమా చూడడం ఒక అలవాటు. ఇప్పుడు అక్కడే 'ది రాజా సాబ్' మొదటి ప్రోగ్రాం జరగబోతోంది.

Also Read: హీరోలకు ఇన్‌ డైరెక్ట్‌గా క్లాస్ పీకిన దిల్ రాజు... గద్దర్ అవార్డ్స్ సక్సెస్ పట్ల హ్యాపీ

ఐమాక్స్ దగ్గర ప్రభాస్ కటౌట్ లాంచ్ చేస్తున్నారు. ఉదయం 9:30 నుంచి 10:30 గంటల సమయంలో ఆ ప్రోగ్రాం ఉంటుంది.

10:52 గంటలకు ఐమాక్స్‌లో టీజర్ లాంచ్!ప్రభాస్ కటౌట్ లాంచ్ అయిన తర్వాత మీడియాతో పాటు కొంత మంది ఫ్యాన్స్ సమక్షంలో టీజర్ లాంచ్ ప్రోగ్రాం జరుగుతుంది. దానికి లార్జ్ స్క్రీన్ (ఒకప్పటి ఐమాక్స్) వేదిక కానుంది. భారీ తెర మీద 'ది రాజా సాబ్' టీజర్ చూపించనున్నారు అదే సమయంలో యూట్యూబ్‌లో కూడా రిలీజ్ చేస్తారు. 

మధ్యాహ్నం మీడియాకు రాజా సాబ్' సెట్ విజిట్!'ది రాజా సాబ్' సినిమా కోసం ప్రముఖ కళా దర్శకుడు రాజీవ్ నంబియార్ నేతృత్వంలో భారీ హవేలీ సెట్ ఒకటి రూపొందించారు. అలాగే మరొక సెట్ కూడా వేశారు. అజీజ్ నగర్‌లోని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ స్టూడియోలో వేసిన సెట్‌తో పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ కూడా మీడియాకు చూపించనున్నారు. ఈ రెండు ప్రోగ్రామ్స్ అయ్యేసరికి సాయంత్రం అవుతుంది. ఆ తర్వాత దర్శక నిర్మాతలు మీడియాతో కాసేపు సరదాగా ముచ్చటించనున్నారు.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'ది రాజా సాబ్' సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లు. డిసెంబర్ 5న థియేటర్లలోకి సినిమా రానున్న సంగతి తెలిసిందే.

Also Read'రానా నాయుడు 2' రివ్యూ: డోస్ తగ్గించిన వెంకీ, రానా... నెట్‌ఫ్లిక్స్‌లో క్రైమ్ డ్రామా సిరీస్ సీజన్ 2 వచ్చేసింది... ఇది ఎలా ఉందంటే?