Sekhar Kammula's Kuberaa Trailer Released: మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న అవెయిటెడ్ 'కుబేర' ట్రైలర్ వచ్చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శక ధీరుడు రాజమౌళి హాజరయ్యారు.  కోలీవుడ్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ కాగా.. ట్రైలర్‌తో అది రెండింతలైంది.

ట్రైలర్ గూస్ బంప్స్ అంతే

టైటిల్‌కు తగ్గట్లు 'కోట్లు.. కోట్లు.. కోట్లు.. అంటే ఎంత సార్?' అనే ఫస్ట్ డైలాగ్‌తోనే ట్రైలర్ ప్రారంభం కాగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 'ఈ దేశంలో డబ్బు, పవర్ మాత్రమే పని చేస్తాయి.. నీతి నిజాయితీ కాదు.' అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ వేరే లెవల్‌లో ఉంది. బిచ్చగాడి పాత్రలో ధనుష్ అదరగొట్టారు. 'డబ్బులు, పోలీసులు, కోర్టులు అన్నీ వాళ్లవే.. మనలాంటోళ్ల చేతుల్లో ఏమీ ఉండదు. ఈ ప్రపంచం మొత్తం వాళ్లదే..' అంటూ రష్మిక డైలాగ్ ఆసక్తిని పెంచేస్తోంది.

 

రిచ్చెస్ట్ పర్సన్ Vs బిచ్చగాడు

ఈ మూవీలో ధనుష్ ఎన్నడూ లేని విధంగా డిఫరెంట్ రోల్ బిచ్చగాడిగా కనిపించారు. అటు నాగార్జున ఈడీ అధికారిగా కనిపించగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఓ వ్యక్తికి.. వీధుల్లో జీవించే నిరుపేద వ్యక్తికి మధ్య జరిగే సంఘర్షణే ఈ మూవీ అని ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. హవాలా, మనీ లాండరింగ్ బ్యాక్ డ్రాప్‌లో మూవీ సాగనున్నట్లు తెలుస్తుండగా.. దేవీశ్రీ ప్రసాద్ బీజీఎం మూవీకే హైలెట్‌గా నిలిచింది. 'నా ప్రపంచం ఇక్కడే ఉంది. అక్కడ డబ్బులు, పోలీసులు, కోర్టులు మీరు చెప్పినవి ఏవీ ఉండవు. అక్కడే తేల్చుకుంటా..' అంటూ ధనుష్ చెప్పే డైలాగ్ వేరే లెవల్ అంతే.

ఈ మూవీని భారీ బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మించారు. సినిమాలో నాగార్జున, ధనుష్, రష్మికలతో పాటు జిమ్ సర్బ్, ప్రియాంశు ఛటర్జీ, దలీప్ తాహిల్ తదితురులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్ మూవీపై ఆసక్తిని పెంచేయగా.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది 'కుబేర'.

Also Read: అప్పుడు 'నంది'... ఇప్పుడు 'గద్దర్' - రెండు రాష్ట్రాల ఉత్తమ పురస్కారాలు గెలిచిన సినీ జర్నలిస్ట్ రెంటాల జయదేవ