తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'తెలంగాణ గద్దర్‌ పురస్కారాల ప్రధానోత్సవం' (Telangana Gaddar Film Awards) గ్రాండ్ సక్సెస్ అవ్వడం సంతోషాన్ని ఇచ్చిందని ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, ప్రముఖ నిర్మాత 'దిల్‌' రాజు తెలిపారు. ఆయనతో ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్‌ ఐఏఎస్‌ ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈవెంట్ సక్సెస్ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన 'దిల్' రాజు... కొందరు సెలబ్రిటీలు గైర్హాజరు కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్‌డైరెక్ట్‌గా క్లాస్ పీకారు.

ప్రభుత్వం అవార్డు ఇస్తే వచ్చి తీసుకోవాలి!ప్రభుత్వం నుంచి పురస్కారాలు వస్తున్నాయంటే సినిమా పరిశ్రమలోని అందరూ బాధ్యతగా స్వీకరించాలని 'దిల్' రాజు తెలిపారు. ఎవరైనా సరే చిత్రీకరణలతో బిజీగా ఉన్నప్పటికీ, ఎవరు ఎక్కడ ఉన్నా ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చిందంటే ఏ రాష్ట్రంలో వేడుక జరుగుతున్నా వచ్చి అవార్డు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. 

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ అక్కినేని నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ సహా పలువురు అగ్ర హీరోలు గద్దర్ పురస్కారాల వేడుకకు గైర్హాజరు అయ్యారు. దిల్ రాజు ఎవరి పేరునూ ప్రత్యేకంగా ప్రస్తావించలేదు గానీ... భవిష్యత్తులో ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు వస్తే స్వీకరించాలని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద నుంచి అవార్డు తీసుకోవడం అందరికీ సంతోషాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. పెద్ద వేడుకలో చిన్న చిన్న తప్పులు జరిగి ఉంటే ఎఫ్‌డీసీ తరపున 'దిల్' రాజు క్షమాపణలు కోరారు.

Also Readసీఎం రేవంత్ రెడ్డి అనుమతి తీసుకుని మరీ... 'గద్దర్ అవార్డ్స్'లో 'పుష్ప 2' డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్

సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి దిల్ రాజు థాంక్స్ చెప్పారు. మొదట సీఎం గద్దర్ అవార్డ్స్ వేడుక కోసం గంట కేటాయించినా... తాను రిక్వెస్ట్ చేయడంతో రెండున్నర గంటల పదిహేను నిమిషాలు కేటాయించారని 'దిల్' రాజు తెలిపారు. అందుకు సీఎంకి స్పెషల్ థాంక్స్ చెప్పారు.

Also Read'రానా నాయుడు 2' రివ్యూ: డోస్ తగ్గించిన వెంకీ, రానా... నెట్‌ఫ్లిక్స్‌లో క్రైమ్ డ్రామా సిరీస్ సీజన్ 2 వచ్చేసింది... ఇది ఎలా ఉందంటే?