Purushothamudu Trailer: యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ప్రేమించి మోసం చేశాడంటూ అతడి ప్రియురాలు లావణ్య కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న ఈ తరుణంలో తాజాగా రాజ్‌ తరుణ్‌ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. అతడు నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'పురుషోత్తముడు'. 'ఆకతాయి', 'హమ్ తుమ్' ఫేం రామ్ భీమన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్‌ తరుణ్‌ సరసన హాసిని సుధీర్  హీరోయిన్‌గా నటిస్తుంది.


ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ, కస్తూరి, బ్రహ్మనందం ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఫ్యామిలీ ఎమోషన్స్‌, లవ్‌ డ్రామా తెరకెక్కిన ఈ ట్రైలర్‌ అద్యాంతం ఆకట్టుకుంటుంది. హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్‌ సీన్స్‌ బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ ట్రైలర్‌ చివరిలో ప్రకాశ్‌ రాజ్‌ రాజ్‌ తరుణ్‌ పురుషోత్తముడు అని చెప్పిన డైలాగ్‌ ట్రైలర్‌కి హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం ప్రకాశ్‌ రాజ్‌ డైలాగ్‌పై నెట్టింట చర్చ జరుగుతుంది.


ట్రైలర్ విషయానికి వస్తే..


మెసేజ్ ఓరియెంటెడ్, మాస్ కమర్షియల్‌తో మలిచిన 'పురుషోత్తముడు' ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. 'అహింస పరమో ధర్మః.. ధర్మ హింస తదైవచ' అంటూ రాజ్‌ తరుణ్‌ డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. ఇందులో రాజ్‌ తరుణ్‌ ఇంటెన్స్‌ లుక్‌లో కనిపించాడు. విలన్‌తో ఫైట్‌ నేపథ్యంలో ఈ డైలాగ్‌ చెప్పించినట్టు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత హీరోయిన్‌తో లవ్‌, కుర్రాడిగా రాజ్‌ తరుణ్‌ అల్లరి, ఆకతాయి పనులు.. ఇలా ఎంటర్‌టైన్‌మెంట్‌తో మొదలైన ట్రైలర్‌ ఆ తర్వాత సీరియస్‌గా సాగింది. ట్రైలర్‌లోనే ప్రధాన పాత్రలన్నింటిని పరిచయం చేసి మూవీ హైప్ క్రియేట్‌ చేశారు. ముఖ్యంగా రమ్యకృష్ణ లుక్‌, డైలాగ్స్‌ పవర్ఫుల్‌గా అనిపించాయి.



 






"వాడు అరుదైన పక్షిరా... పంజరంలో ఉన్నంతవరకే సేఫ్టి" అనే డైలాగ్‌ ఆసక్తిని పెంచుతుంది. ఇక ఈ సీన్‌లో రమ్యకృష్ణ లుక్‌, డైలాగ్‌ డెలివరీ బాగా ఆకట్టుకుంటుంది. మధ్యలో బ్రహ్మనందం కానిస్టేబుల్‌ పాత్రలో తనదైన కామెడీతో నవ్వించారు. రాజ్‌ తరుణ్‌ని పోలీసు ఆఫీసర్‌(రాజా రవింద్ర) కాలర్‌ పట్టుకుని లాక్కేళ్లడం.. "ఇంత అన్నం పెడితే కుక్కకి కూడా విశ్వాసం ఉంటుంది.. కానీ నువ్వు ప్రతి రోజు మోసం చేస్తూనే తిరుగుతున్నావ్‌" అనే డైలాగ్‌ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతుంది. చిన్నోడివైన చేతులెత్తి దండం పెడుతున్నాం అంటూ ఊరంతా రాజ్‌ తరుణ్‌తో అనడం.. నువ్వు మాకు సాయం చేయాలన్న ఓ పాత్రతో డైలాగ్‌ వస్తుంది.


చూస్తుంటే కష్టాల్లో ఉన్న ఊరి ప్రజలకు రాజ్‌ తరుణ్‌ అండగా నిలబడతాడనిపిస్తోంది. ఆ తర్వాత మన కాళ్లను కాపాడుకోవాలంటే.. ఊరంతా తివాజీ పరవాల్సిన అవసరం లేదని రమ్యకృష్ణ చెప్పిన డైలాగ్‌ ఆసక్తిగా పెంచుతుంది. మధ్యలో హీరోని టార్గెట్‌ చేస్తూ విలన్స్‌ మాట్లాడుకోవడం, పోలీసు ఆఫీసర్‌ని హీరో కొట్టడం వంటి యాక్షన్‌ సన్నివేశాలు హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఇక బాలీవుడ్‌ నటుడు ముఖేష్‌ ఖన్నా విలన్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. 'మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను' అంటూ ఆయనకు సంబంధించిన చిన్న సీన్‌ పెట్టి మూవీప అంచనాలు పెంచారు. ట్రైలర్‌లో సాధారణ యువకుడిలా కనిపించిన రాజ్‌ తరుణ్‌ మధ్య మధ్యలో సూట్‌ బూట్‌తో ధనికుడిగా చూపిస్తూ మూవీపై అంచనాలు పెంచాడు డైరెక్టర్‌.


"నీతో ఏమాత్రం నీతి, నిజాయితి ఉన్న వీటన్నిటికి సమాధానం చెప్పు"అంటూ హీరోయిన్‌ రాజ్‌ తరుణ్‌ ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత ఊరి జనం కోసం నిలబడ్డ రాజ్‌ తరుణ్‌ ఉద్దేశిస్తూ ప్రకాశ్‌ రాజ్‌ చెప్పిన డైలాగ్‌ ట్రైలర్‌ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. "పరశురామయ్య, రఘురామయ్య, ఆదిత్య రామ్‌, అభయ్‌ రామ్‌ ఇలా వ్యక్తి పేరులో రాముడు ఉండటం కాదు.. వ్యక్తిత్వంలో రాముడు ఉండాలి.. మనసా..వాఛ.. కర్మణ నిలబడిన పురుషోత్తముడు వాడు" అంటూ ప్రకాశ్ రాజ్‌ చెప్పిన డైలాగ్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయి. ఇక చివరిలో "నేను అసలు కొట్టను.. కానీ, కొడితే మాత్రం మామూలుగా కొట్టను" అనే రాజ్‌ తరుణ్‌ డైలాగ్‌తో ట్రైలర్‌ ముగుస్తుంది. మొత్తానికి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో మెసే్‌ ఒరియంటెడ్‌గా సాగిన "పురుషోత్తముడు" ట్రైలర్‌ మూవీపై అంచనాలు పెంచేస్తోంది.


Also Read: సోషల్‌ మీడియా కీచకుడు ప్రణీత్‌ హనుమంతుపై డ్రగ్‌ కేసు - గంజాయి, డ్రగ్స్‌ తీసుకున్నట్టు గుర్తించిన పోలీసులు