Drug Case on Praneeth Hanumanthu: సోషల్ మీడిమా కీచకుడు, యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు మరిన్ని చిక్కుల్లో పడ్డాడు. తండ్రికూతురు బంధంపై అసభ్యకర రితీలో కామెంట్స్ చేసినందుకు ఇప్పటికే ప్రణీత్‌ను హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అతడి డ్రగ్ కేసు కూడ్ బుక్ అయ్యింది. ప్రణీత్ డ్రగ్స్ తీసుకోవడంతోపాటు గంజాయి తాగినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిపై 79,294 బీఎన్‌ఎస్, ఎన్డీపీఎస్ చట్టాల కింద కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ప్రణీత్ చంచల్‌గూడ్ జైలులో ఉన్నాడు. డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించిన పోలీసులు అతడిని మూడు రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. ఇటీవల ప్రణీత్ హనుమంతు వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తండ్రికూతురు వీడియోపై తన స్నేహితుల కలిసి అసహాస్యం చేశాడు. అంతేకాదు లైంగిక రితీలో సంచలన కామెంట్స్ చేశాడు. దీంతో అతడిపై కఠిన చర్యలు తీసకోవాలని కోరుతూ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రెండు తెలుగు రాష్ట్రాల సీఎం, డిప్యూటీ సీఎంలను కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వ్యవహరం ఒక్కసారిగా గుప్పుమంది. సాయి ధరమ్ తేజ్‌కు సపోర్టు చేస్తూ ప్రణీత్‌పై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు, సినీ సెలబ్రిటీల నుంచి డిమాండ్స్ వచ్చాయి.
దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ప్రణీత్ హనుమంతుపై చర్యలకు ఆదేశించారు. దీంతో గతవారం ప్రణీత్‌ను బెంగళూరులో తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హదరాబాద్‌కు తీసుకువచ్చి అతడిపై పోక్సో చట్టంతో పాటు 67B, IT పలు సెక్షన్ల కింది కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం ప్రణీత్‌ను చంచల్‌గూడ్ జైలుకి తరలించారు. ఇప్పటికే వివాదస్పద వ్యాఖ్యలతో జైలు శిక్ష అనుభవిస్తున్న అతడిపై తాజాగా మరో వివాదస్పద కేసులు నమోదు కావడం సంచలనం రేపుతుంది. ప్రణీత్ తరచూ డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్టు గుర్తించి కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా విచారణకు అనుమతించాల్సిందిగా కోర్టును కోరినట్టు తెలుస్తోంది. మరి ఈ కేసుకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: 'డార్లింగ్' ఓటీటీ, శాటిలైట్ పార్ట్నర్ ఫిక్స్ - ప్రియదర్శి, నభా నటేష్ సినిమా స్ట్రీమింగ్ ఎందులో అంటే?