Raj Kundra 60 Crore Fraud Case:   బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాపై నమోదైన రూ. 60 కోట్ల మోసం కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది, బాలీవుడ్ హీరోయిన్లు బిపాషా బసు, నేహా ధూపియాకు ఫీజుగా కొంత మొత్తం చెల్లించానిని వ్యాపారవేత్త రాజ్ కుంద్రా చెప్పినట్టు సమాచారం. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW)కి ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన ఈ విషయం చెప్పారు.

Continues below advertisement


సోర్సెస్ ప్రకారం.. ఈ కేసులో కొంత డబ్బును బిపాషా, నేహాకు ఫీజుగా చెల్లించానని కుంద్రా పేర్కొన్నారు. అయితే ఐదు గంటల పాటు జరిగిన విచారణలో ఆయన పలు కీలక అంశాలపై మౌనం వహించడంతో EOW మరింత లోతుగా ప్రశ్నించాలని యోచిస్తోంది.


నివేదికల ప్రకారం, శిల్పా శెట్టి, బిపాషా బసు, నేహా ధూపియా సహా నలుగురు హీరోయిన్ల అకౌంట్స్ లోకి నేరుగా కంపెనీ ఖాతాల నుంచి నిధులు బదిలీ అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అదనంగా, బాలాజీ ఎంటర్టైన్మెంట్ కు కూడా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఇప్పటివరకు, EOW దాదాపు 25 కోట్లు నేరుగా బదిలీ అయినట్లు గుర్తించింది.


నోట్ల రద్దు సమయంలో కంపెనీ ఆర్థిక లావాదేవీలపై నగదు కొరత ప్రభావం చూపిందని, ఆ సమయంలో కొన్ని అనుమానాస్పద నిధులు ఇతర ఖాతాలకు బదిలీ అయ్యాయని దర్యాప్తులో తేలింది. ఈ బదిలీలకు సంబంధించిన ఆధారాలను EOW సేకరించింది. కొన్ని కంపెనీల్లో రూ.60కోట్లు పెట్టుబడులుగా పెట్టినట్లు విచారణ సమయంలో రాజ్ కుంద్రా అంగీకరించినట్టు తెలుస్తోంది..అయితే వాటిని నిజంగానే సంబంధిత కంపెనీలకు మళ్లించారా లేదంటే ఇతర వ్యక్తిగత ఖర్చులకు వినియోగించారా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. వీటితో పాటూ రాజ్ కుంద్రా ఇతర వ్యాపారాలపై, అద్దెకు తీసుకున్న కార్యాలయాలకు సంబంధించిన చెల్లింపులపైనా సమాచారం సేకరిస్తున్నారు.


"బెస్ట్ డీల్" కోసం రూపొందించిన వీడియోలను సమర్పించాలని కుంద్రాను కోరారు. వీటిని ఇప్పటికే ఆస్తి విభాగం అధికారులకు అందజేసినట్లు ఆయన పేర్కొనగా, మరింత పరిశీలన కోసం వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది ... మరికొన్ని పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను కూడా రాబోయే రోజుల్లో విచారణకు పిలిపించే అవకాశం ఉంది.


ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ఇటీవల రూ. 60 కోట్ల మోసం కేసులో రాజ్ కుంద్రా వాంగ్మూలం నమోదు చేసింది. ఈ కేసులో ముంబై పోలీసులు ఒక ప్రకటన విడుదల చేస్తూ: "నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై రూ. 60 కోట్ల మోసం కేసులో దర్యాప్తు జరుగుతోంది. ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం రాజ్ కుంద్రాకు సమన్లు ​​జారీ చేసింది. విచారణ కోసం పోలీసుల ఎదుట హాజరు కావాలని కోరారు."


(ఈ నివేదిక ఆటో-జనరేటెడ్ సిండికేట్ వైర్ ఫీడ్లో భాగంగా ప్రచురితమైంది. హెడ్లైన్లు మినహాయించి, ABP లైవ్ ద్వారా కాపీలో ఎటువంటి మార్పులు చేయలేదు.)