Siddu Jonnalagadda Joins In Social Media X : టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తాజాగా సోషల్ మీడియా 'X'లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన హీరోగా చేస్తోన్న రీసెంట్ మూవీ 'తెలుసు కదా' గురించి పోస్ట్ చేస్తూ సర్ ప్రైజ్ ఇచ్చారు. 'హలో 'X' నేను మీ... తెలుసు కదా' అంటూ ఓ ఫన్ ఎమోజీతో పోస్ట్ చేశారు. 'లవ్ యూ 2... అక్టోబర్ 17న థియేటర్లలో కలుద్దాం' అంటూ రాసుకొచ్చారు. దీంతో ఇది వైరల్ అవుతోంది.

అంతకు ముందు సిద్ధూకు ఓ 'X' అకౌంట్ ఉండగా... దానిలో అంతగా యాక్టివ్‌గా లేరు. ఇప్పుడు తాజాగా మరో 'X' అకౌంట్‌తో ఎంట్రీ ఇచ్చారు. ఆయన లేటెస్ట్ మూవీ 'తెలుసు కదా' ప్రమోషన్స్ కోసం దీన్ని వాడుతున్నారు.  

టిల్లూ భాయ్‌కు గ్రాండ్ వెల్ కం

మన టిల్లూ భాయ్‌కు నెటిజన్లు గ్రాండ్ వెల్ కం చెబుతున్నారు. 'అన్నొచ్చాడు Xలోకి అన్నొచ్చేశాడు', 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'తెలుసు కదా' మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

Also Read: 8th ఫెయిల్... 'ఉగ్రం' To ఎన్టీఆర్ 'డ్రాగన్' - ప్రశాంత్ నీల్ దేవుడన్న 'సలార్' మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్

గత కొంతకాలంగా సిద్ధు ఖాతాలో సరైన హిట్ పడలేదు. రీసెంట్‌గా వచ్చిన 'జాక్' కూడా నిరాశపరిచింది. ఈ సారి ట్రయాంగిల్ లవ్ స్టోరీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన లవ్ సాంగ్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. సిద్ధు సరసన రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా చేస్తుండగా... వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు కన్నడ భాషల్లో ఈ నెల 17న మూవీ రిలీజ్ కానుంది. మ్యూజిక్ లెజెండ్ తమన్ మ్యూజిక్ అందిస్తుండగా... పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ మూవీని నిర్మిస్తున్నారు.