Ravi Basrur About Relation With Prashanth Neel: డైరెక్టర్ ప్రశాంత్ నీల్... ఈ పేరు వింటే మనకు కేజీఎఫ్ చాప్టర్ 1, 2, ప్రభాస్ 'సలార్' వంటి బిగ్గెస్ట్ హిట్ మూవీస్ గుర్తొస్తాయి. కానీ ఆయన కన్నడలో 'ఉగ్రం' అనే సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. శ్రీ మురళి హీరోగా నటించిన ఈ మూవీ 2014లో రిలీజై సంచలన విజయం సాధించింది. దీంతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకోగా... కేజీఎఫ్, సలార్ మూవీస్‌తో ఆ హైప్ పదింతలైంది. ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో డ్రాగన్ తీస్తున్నారు. 

Continues below advertisement


ఫస్ట్ మూవీ నుంచి జర్నీ


ప్రశాంత్ నీల్ ఫస్ట్ మూవీ 'ఉగ్రం' నుంచీ రీసెంట్ ఎన్టీఆర్ 'డ్రాగన్' వరకూ కూడా ఆయన సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా రవి బస్రూర్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈయన 'వీర చంద్రహాస' మూవీతో దర్శకుడిగా మారారు. ఓ ఈవెంట్‌లో ప్రశాంత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. 


నేను 8th ఫెయిల్


తాను 8వ తరగతి ఫెయిల్ అయ్యానని... కన్నడ 'ఉగ్రం' సినిమా వచ్చే వరకూ అన్నీ డిజాస్టర్లేనని గుర్తు చేసుకున్నారు రవి బస్రూర్. 'నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నాకు దేవుడితో సమానం. నన్ను నమ్మిన ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మనం ఏ స్థాయికి వెళ్లినా మన మూలాలను మర్చిపోకూడదని నేను నమ్ముతాను. 'వీర చంద్రహాస' మూవీ యక్షగాన కలతో రూపొందిన చిత్రం. మన కల్చర్ కాపాడుకునేలా ఉండే ఈ మూవీతో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాను.


ఇదొక రేటెడ్ స్టోరీ. యక్షగానం కల్చర్ రిప్రెజెంట్ చేసేలా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ నా 12 ఏళ్ల కల. సక్సెస్ సాధించిన ప్రతీ ఒక్కరి స్టోరీ ఇందులో ఉంటుంది. జీరో నుంచి హీరోగా ఎలా అవుతారనే డెడికేషన్ ఈ కథలో ఉంటుంది. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఓ మూవీ చేయడంతో దాదాపు 4 వేల మందికి ఉపాధి కలుగుతుంది. మ్యూజిక్ చేయడంతో వచ్చే డబ్బును సరైన మార్గంలో ఉపయోగించాలనే ఉద్దేశంతోనే ఏడాదికి ఒక సినిమాను దర్శక నిర్మాతగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఇది నా ఆరో సినిమా. దీని ద్వారా కొత్తవాళ్లను ఎంకరేజ్ చేస్తాను.' అని చెప్పారు.


Also Read: కిష్కింధపురి విలన్ ఎవరో తెలుసా? 600 కోట్ల కొల్లగొట్టిన మూవీలో నటుడు... కళ్యాణీ ప్రియదర్శన్‌ 'లోక'లోనూ!


ఈ నెల 19న రిలీజ్


రవి బస్రూర్ దర్శకుడిగా మారిన ఫస్ట్ మూవీ 'వీర చంద్రహాస'. ఏప్రిల్ 19న కన్నడలో రిలీజ్ అయిన ఈ మూవీ అక్కడ సంచలన విజయం అందుకుంది. ఇప్పుడు ఈ మూవీని తెలుగులో ఈ నెల 19న రిలీజ్ చేస్తున్నారు. కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్, ఎస్జేకే సంస్థలపై ఎమ్‌వీ రాధాకృష్ణ, జేమ్స్ డబ్యూ కొమ్ము తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మూవీలో శివరాజ్ కుమార్, శిథిల్ శెట్టి, నాగశ్రీ జేఎస్, ప్రసన్న శెట్టిగార్ మందార్తి, ఉదయ్ కడబాల్, ప్రజ్వల్ కిన్నాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.