ది విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కింగ్‌డమ్'. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు... ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'రగిలే రగిలే...' పాట విడుదల చేశారు. ఈ సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. రగిలే రగిలే‌... అనిరుద్ మాస్...పాడింది మాత్రం అనిరుద్ కాదు!Ragile Ragile song from Kingdom raises expectations: సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మీద ఇటీవల ఒక విమర్శ వచ్చింది. ప్రతి పాట అతను పాడేస్తున్నాడని, అతను సంగీతం అందించే సినిమాలలో పాటలను ఇతరుల చేత పాడిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. సరిగ్గా అటువంటి సమయంలో 'రగిలే రగిలే...' పాట వచ్చింది.

హీరోయిజం ఒక రేంజ్‌లో ఎలివేట్ చేసే విధంగా రగిలే రగిలే పాట ఉంది. దీనిని అనిరుద్ పాడలేదు మరొకరితో పాటించారు. ఒక విధంగా సిద్ధార్థ్ బస్రూర్ గాత్రం పాటకు కొత్త టోన్ తీసుకువచ్చింది. ఈ సాంగ్ విడుదల తర్వాత ఫ్యాన్స్ అందరూ 'ఇప్పుడు ఈ పాట విడుదల చేస్తారా? ఎప్పుడో విడుదల చేస్తే సినిమా మీద మరింత హైప్ వచ్చేది' అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: నాగ్ మామ కాదు... నాగ్ సామ - అదీ జపాన్‌లో మన కింగ్ క్రేజ్!

ప్రీమియర్స్ వేయడం లేదు...డైరెక్ట్ జూలై 31న సినిమా విడుదల!Kingdom Release Date: శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అధినేత్రి సాయి సౌజన్య సంయుక్తంగా 'కింగ్‌డమ్' చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. జూలై 31న థియేటర్లలో విడుదల అవుతోంది. తొలుత ఈ సినిమాకు జూలై 30వ తేదీన ప్రీమియర్స్ వేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఆ ప్లాన్ క్యాన్సిల్ చేశారు. 

Also Readవిడాకులు అడిగితే మొగుడ్ని కొట్టి కట్టేసింది... ట్రెండీగా & కామెడీగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' టీజర్!

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాలలో 'కింగ్‌డమ్' ప్రీమియర్ షోలు పడడం లేదు. అమెరికాలో మాత్రం ప్రీమియర్లు వేస్తున్నారు. మన దేశమంతటా గురువారం ఉదయం ఆటలతో సినిమా విడుదల కానుంది.‌ ఇటీవల ప్రీమియర్ షోలు వేసిన సినిమాలకు బాక్సాఫీస్ రిజల్ట్స్ దగ్గర ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రీమియర్ షో టికెట్స్ ఎక్కువ రేటుకు అమ్మడం వల్ల మొదటిరోజు కలెక్షన్స్ వస్తున్నాయి. కానీ సినిమా అటు ఇటుగా ఉంటే నెగిటివ్ టాప్ రావడం వల్ల వీకెండ్ తర్వాత ఎఫెక్ట్ ఎక్కువ పడుతోంది. థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గుతోంది. అందుకని ప్రీమియర్ షోలు క్యాన్సిల్ చేశారని టాక్. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలలో కూడా సినిమా విడుదల అవుతుంది. హిందీలో 'సామ్రాజ్య' టైటిల్ ఖరారు చేశారు. తమిళనాడులో స్టార్ హీరో సూర్య ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.