తెలుగు ప్రేక్షకులకు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏయన్నార్ వారసుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఆయన, తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. తండ్రిని మించి అన్నపూర్ణ స్టూడియోస్ సామ్రాజ్యాన్ని విస్తరించారు. పాన్ ఇండియా స్థాయిలో అక్కినేని లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. ఇండియాలో ఆయన్ను 'కింగ్' అంటారు. మరి, జపాన్ ప్రేక్షకులు ఆయన్ను ఏమంటున్నారో తెలుసా?

నాగ్ సామ... రెస్పెక్ట్ ఇస్తున్న జపనీస్!రణబీర్ కపూర్ 'బ్రహ్మాస్త' సినిమాలో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్ర పోషించారు. ఆ సినిమా జపాన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అంతే కాదు... నాగార్జునకు మంచి పేరు వచ్చింది. అంతకు ముందు జపాన్ ఆడియన్స్ కొందరికి ఆయన తెలిసినా, 'బ్రహ్మాస్త్ర' తర్వాత ఆయన ఫాలోయింగ్ మరింత పెరిగింది. నాగార్జున సినిమాలను ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఆయనకు అక్కడ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

దీపక్ పాత్రలో కింగ్ అక్కినేని నాగార్జున నటించిన తాజా సినిమా 'కుబేర'. ధనుష్, రష్మిక ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఓటీటీలో విడుదల అయ్యాక జపాన్ ప్రేక్షకులు చూశారు. 'నాగ్ సామ' యాక్టింగ్ గురించి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. నాగ్ సామ అంటే ఎవరో కాదు... మన కింగ్ అక్కినేని నాగార్జున. నాగ్ మామను నాగ్ సామ చేశారని అనుకుంటే పొరపాటే.

Also Read: విడాకులు అడిగితే మొగుడ్ని కొట్టి కట్టేసింది... ట్రెండీగా & కామెడీగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' టీజర్!

తెలుగు ప్రజలు గౌరవం, మర్యాద ఇచ్చేటప్పుడు 'గారు, అండీ' అంటారు కదా! ఆ విధంగా జపాన్ ప్రేక్షకులు 'సామ' అంటారు. నాగార్జునకు జపనీస్ ఎంత గౌరవం ఇస్తున్నారనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సాధారణంగా తమ దేవుళ్లను, రాజులను, గొప్పవాళ్లను జపనీయులు 'సామ' అంటారు. నాగార్జునకు ఆ స్థాయిలో గౌరవం ఇవ్వడం విశేషం. 'కుబేర'లో దీపక్ పాత్రలో ఆయన నటన వాళ్ళను మరింత ఆకట్టుకుంది.

Also Read'బిగ్ బాస్ 9'లో సామాన్యులకు అగ్ని పరీక్ష... టీవీలో కాదట - మెయిన్ ట్విస్ట్‌, కీలక మార్పు ఏమిటో తెలుసా?